News


50రోజుల్లో బీపీసీఎల్‌ ఆస్తుల మదింపు!

Monday 25th November 2019
news_main1574659117.png-29832

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ విక్రయంలో భాగంగా సంస్థ ఆస్తుల విలువ లెక్కించేందుకు ప్రభుత్వం విలువ మదింపుదారుకు 50 రోజుల కాలపరిమితి విధించింది. దీంతో బీపీసీఎల్‌ వాటా విక్రయ ప్రక్రియలో తొలి అడుగు పడినట్లయింది. విలువ మదింపు పూర్తయ్యాక కొనుగోలుదారుల నుంచి బిడ్స్‌ ఆహ్వానిస్తారు. ఈ నెల 20న బీపీసీఎల్‌తో పాటు ఎస్‌సీఐ, టీహెచ్‌డీసీఐఎల్‌, నీప్కోలను మేనేజ్‌మెంట్‌ నియంత్రణతో సహా కొత్త ఇన్వెస్టర్లకు అమ్మేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం వేసింది. వీటితో పాటు కాన్‌కర్‌లో మెజార్టీ వాటా విక్రయాన్ని కూడా ఆమోదించింది. ఈ వాటాల విక్రయం రెండు దశల్లో జరుగుతుంది. తొలుత ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఈఓఐ(ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) ఆహ్వానిస్తారు. వచ్చిన వారిని పరిశీలించి రెండో దశలో ధరల బిడ్లు వేయమని కోరతారు. అత్యధిక బిడ్‌ దాఖలు చేసిన వారికి అవకాశం ఇస్తారు.

ఈ నేపథ్యంలో వాటాలు విక్రయించే కంపెనీల ఆస్తుల విలువ మదింపుదారులను ఆహ్వానిస్తూ డీఐపీఏఎం అక్టోబర్‌లోనే ప్రకటన ఇచ్చింది. కేబినెట్‌ ఆమోదానంతరం మదింపు చేయాల్సిన సంస్థల పేర్లను వెల్లడిస్తూ పాత ప్రకటనకు అనుబంధ ప్రకటన జారీ చేసింది. బీపీసీఎల్‌కు చెందిన అన్ని రకాల ఆస్తులను సరిగా లెక్కించి సదరు వాల్యూషన్‌ రిపోర్ట్‌ను అపాయింట్‌మెంట్‌ లెటర్‌ పొందిన 50 రోజుల్లో సమర్పించాలని ఈ ప్రకటనలో పేర్కొంది. విలువ మదింపుదారులు దరఖాస్తు చేసుకోవడం ఈ నెల 4నే ముగిసింది. ఇప్పుడీ దరఖాస్తుల్లోంచి ఒక సంస్థను ఎంచుకొని బీపీసీఎల్‌ ఆస్తుల విలువ లెక్కింపు పనిని అప్పగిస్తారు. ఎస్‌సీఐ, కాన్‌కర్‌ వాటాల విక్రయానికి కూడా ఇదే విధానం అవలంబిస్తారు. మిగిలిన రెండు కంపెనీల్లో వాటాలను ఎన్‌టీపీసీ కొంటున్నందున ఈ ప్రక్రియేమీ ఉండదు. 



You may be interested

పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..జిందాల్‌ స్టీల్‌ 6% అప్‌

Monday 25th November 2019

అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండడంతో దేశీయ మెటల్‌ షేర్లు సోమవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.13 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.51 శాతం లాభపడి 2,584.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  జిందాల్‌ స్టీల్‌ 5.93 శాతం పెరిగి రూ. 152.70 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 144.20 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 145.15 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది.

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ!

Monday 25th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్లో స్వల్పంగా పెరిగి 71.69 వద్ద ప్రారంభమైంది. రూపీ శుక్రవారం సెషన్‌లో 71.71 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలకు సంబంధించి అనేక వార్తలు వెలువడడంతో సోమవారం సెషన్‌లో డాలర్‌, ఎగుమతి కేంద్రీకృత కరెన్సీలు బలపడ్డాయి. అంతేకాకుండా బ్రెగ్జిట్‌పై ఆశలు పెరగడంతో బ్రిటన్‌ పౌండ్‌ బలపడింది. ‘యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుతోంది. గత వారం రూపీ-డాలర్‌ జంట్‌

Most from this category