News


తప్పుడు లాభాలు, మార్జిన్‌లు..ఇన్ఫోసిస్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

Monday 21st October 2019
news_main1571638638.png-29028

  • కంపెనీ బోర్డుకు, యుఎస్‌ నియంత్రణ సంస్థకు లేఖ

  ఇన్ఫోసిస్‌ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్‌, కంపెనీ బోర్డుకు, యుఎస్‌ సెక్యురిటీస్‌, ఎక్సేంజ్‌ కమిషన్‌(ఎస్‌ఈసీ-సెక్‌)కి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఈ ఆరోపణలను బలపరిచే ఈ మెయిల్స్‌, వాయిస్‌ రికార్డింగులున్నాయని పేర్కొంది. ఇన్ఫోసిస్‌ బోర్డుకు, సెక్‌కు పంపిన లేఖ కాపీలను ఫిర్యాదుదారులు ఆంగ్ల మీడియా ఎకనామిక్‌టైమ్స్‌తో కూడా పంచుకున్నారు. ఎకనామిక్‌ టైమ్స్‌ కథనం ప్రకారం పెద్ద ఒప్పందాలను ఆమోదించడంలో భాగంగా కంపెనీ సీఈఓ సాలిల్‌ పరేఖ్‌, సమీక్షలను, ఆమోదాలను దాటవేసేవారని ఉద్యోగల గ్రూప్‌ లేఖ పేర్కొంది. ‘తప్పుడు మార్జిన్‌లను చూపే విధంగా ఆయన(సీఈఓ) మమల్ని అదేశించేవారు. పెద్ద ఒప్పందాలకు సంబంధించి సమస్యలను బోర్డు ప్రెజెంటేషన్లో చూపించకుండా సీఎఫ్‌ఓ తమను నిరోధించేవారని, గత కొన్ని త్రైమాసికాలలోని బిలియన్‌ డాలర్‌ ఒప్పందాలు సున్నా మార్జిన్‌లతో ఉండేవి’ అని ఫిర్యాదుదారులు లేఖలో పేర్కొన్నారు. ‘ఒప్పంద ప్రతిపాదనలను, మార్జిన్‌లను, బయటపడని ముందస్తు కమిట్‌మెంట్లలను, ​ఆదాయాలను ఆడిటర్లు దయచేసి పరిశీలించాలి’ అని లేఖలో ఉంది. 
    ఈ ఆరోపణలకు ఇన్ఫోసిస్‌ స్పందించింది. విజిల్‌బ్లోవర్స్‌( కంపెనీపై ఆరోపణలు చేసేవారు) చేసిన ఆరోపణలను కంపెనీ పరిశీలిస్తుందని ఆదివారం రాత్రి ప్రకటించింది. ‘విజిల్‌బ్లోవర్స్‌ ఫిర్యాదులను ఆడిట్‌ కమిటీ ముందు పెట్టనున్నాం. కంపెనీ విజిల్‌బ్లోవర్స్‌ పాలసీ ప్రకారం ఆడిట్‌ కమిటీ దీనిని విచారించనుంది’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ త్రైమాసికంలో వీసా ఖర్చులను గుర్తించవద్దని, అంతేకాకుండా ఒక కాంట్రాక్టులో జరిగిన 50 మిలియన్‌ డాలర్లు తారుమారైనట్లు గుర్తించవద్దని తమను ఒత్తిడి చేశారని ఈ లేఖలో ఫిర్యాదుదారులు పెర్కొన్నారు. వెరిజోన్, ఇంటెల్, జపాన్‌లోని జేవీ’స్‌, ఏబీఎన్‌ ఆమ్రో యాక్విజేషన్‌ వంటి పెద్ద ఒప్పందాలకు సంబంధించి ఆదాయాలను అకౌంటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా చూడవద్దని ఒత్తిడి చేశారని ఈ లేఖ తెలుపుతోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం 2020 రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ మార్జిన్‌ 120 బేసిస్‌ పాయింట్లు పెరిగింది. అంతేకాకుండా కంపెనీ లాభం విశ్లేషకుల అంచనాల కంటే అధికంగా నమోదైంది.
    కంపెనీ లాభాలను  అధికం చేసి చూపించాలని ఫైనాన్సియల్‌ టీంపై కం‍పెనీ సీఈఓ, సీఎఫ్‌ఓ నిలంజన్‌ రాయ్‌ ఒత్తిడి చేసేవారని ఈ లేఖలో ఫిర్యాదుదారులు ఆరోపించారు. ‘కంపెనీ వార్షిక నివేదిక, సెక్‌ 20ఎఫ్‌ ఫైలింగ్‌ ద్వారా మంచి, పూర్తిగా లేని సమాచారాన్ని మాత్రమే ఇన్వెస్టర్లు, విశ్లేషకులతో పంచుకోవాలని ఒత్తిడి చేశారు. ఇది నియంత్రణకు సంబంధించిన సమస్య. మా దగ్గర మెయిల్స్‌, వాయిస్‌ రికార్డులున్నాయి. పరిశోధన సమయంలో వీటిని పంచుతాము’ అని ఈ లేఖలో పేర్కొన్నారు. అక్టోబర్‌ 3 నాటి ఫాలో అప్‌ లేఖ ప్రకారం,  ఫిర్యాదుదారులు ఈ లేఖను కంపెనీ బోర్డుకు సెప్టెంబర్‌ 20, 2019న, యుఎస్‌ సెక్‌కు సెప్టెంబర్‌ 27, 2019 ఈ గ్రూప్‌ పంపించారు. కాగా ఇన్ఫోసిస్‌ ఏడిఆర్‌లు యుఎస్‌ స్టాక్‌ఎక్సేంజిలో ట్రేడవుతున్న విషయం తెలిసిందే. ఈ   నెల ప్రారంభంలో కంపెనీ డిప్యూటీ సీఎఫ్‌ఓ జయేష్‌ సంగరాజ్కా తన పదవికి రాజినామా చేసిన విషయం గమనార్హం. ఇన్ఫోసిస్‌ చివరిగా 2017లో విజిల్‌బ్లోవర్‌ను ఎదుర్కొంది. అప్పట్లో కంపెనీ సీఈఓ విశాల్‌ సిక్కా, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారయణ్‌ మూర్తిల మధ్య కంపెనీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విశాల్‌ సిక్కా తన పదవి నుంచి వైదొలిగారు.You may be interested

స్వల్పకాలంలో రాబడులిచ్చే షేర్లివే...

Monday 21st October 2019

ఆర్థిక రంగ షేర్లు భారీగా ర్యాలీ చేయడంతో  శుక్రవారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 3.07శాతం లాభపడగా, నిఫ్టీ 3.20శాతం ర్యాలీ చేసింది. మార్చి 26తో ముగిసిన వారం తరువాత ఒక వారంలో జరిగిన అది పెద్ద ర్యాలీ ఇదేకావడం విశేషం. నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు నాగరాజ్‌ శెట్టి అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో నిఫ్టీ ఇండెక్స్ 11,800-850 రేంజ్‌లో కీలక నిరోదాన్ని

తీవ్ర హెచ్చుతగ్గులతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 21st October 2019

ఇక్కడ నిఫ్టీ- ఫ్యూచర్స్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఇండెక్స్‌ నేడు.... కిత్రంరోజు ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11670.00)తో పోలిస్తే ఒక దశలో 50 పాయింట్లు లాభపడి 11720.00 స్థాయికి ఎగిసింది. అనంతరం లాభాలను కోల్పోయి నష్టాల్లోకి మళ్లి, 11,652 పాయింట్ల వద్దకు పడిపోయింది.  ఉదయం 10:40 గంటలకు నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,660 వద్ద ట్రేడ్‌ అవుతోంది.   మిశ్రమంగా ట్రేడ్‌

Most from this category