STOCKS

News


ఏప్రిల్‌కు ముందే డివిడెండ్స్‌ పండుగ?!

Monday 3rd February 2020
news_main1580704784.png-31460

అధిక ప్రమోటర్‌ హోల్డింగ్స్‌ ఉన్న కంపెనీలు మార్చి- ఏప్రిల్‌లోపు భారీగా మధ్యంతర డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని బడ్జెట్లో సవరించినందున అంతకుముందే భారీ డివిడెండ్లు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం కంపెనీల షేర్‌హోల్డర్లు దేశీయ కంపెనీల నుంచి పొందే డివిడెండ్‌ ఆదాయం పదిలక్షల రూపాయల్లోపు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.10 లక్షలు దాటితే 10 శాతం పన్ను చెల్లించాలి. డీడీటీ ఎత్తివేయడంతో షేర్‌హోల్డర్లు వారి వారి టాక్స్‌ స్లాబుల ఆధారంగా డివిడెండ్‌ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఘాతం నుంచి తప్పించుకునేందుకే కంపెనీలు మార్చిలోపు డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతాయని ఏఎన్‌ఎంఐ ప్రెసిడెండ్‌ విజయ్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు. ఇందువల్ల మార్చి వరకు నగదునిల్వలు అధికంగా ఉన్న కంపెనీల షేర్లు ర్యాలీ జరపవచ్చన్నారు. 


ఉదాహరణకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన వ్యక్తిగత సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1800 కోట్ల డివిడెండ్‌ పొందాయి. అనీల్‌ అగర్వాల్‌ ఆయన హోల్డింగ్‌ కంపెనీలు వేదాంత నుంచి రూ. 3500 కోట్ల డివిడెండ్‌ ఆర్జించాయి. హీరోమోటో కార్‌‍్ప నుంచి ముంజల్‌ కుటుంబం దాదాపు రూ.600 కోట్లు డివిడెండ్‌ రూపంలో పొందింది. ఇలాంటి కంపెనీలన్నీ మార్చి చివరకు మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించకపోతే వీటి ప్రమోటర్లు తర్వాత పొందే డివిడెండ్‌పై అధిక పన్ను చెల్లించాల్సిఉంటుంది. గతంలో 2007-08 బడ్జెట్‌లో చిదంబరం డీడీటీని 15 శాతానికి పెంచాడు. దీంతో ఆ సంవత్సరం మార్చిలో కంపెనీలు భారీగా డివిడెండ్స్‌ ప్రకటించాయి. దాదాపు 300 కంపెనీలు ఆ సమయంలో మధ్యంతర డివిడెండ్స్‌ ఇచ్చాయి. 2002లో అప్పటి ఆర్ధిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డీడీటీ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ సంవత్సరం మార్చిలో ఇలాంటి మధ్యంతర డివిడెండ్ల హడావుడి కనిపించింది. ఈదఫా కూడా ఇలాంటి వరదే ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. 



You may be interested

గార్డెన్‌ రీచ్‌ పతనం- థైరోకేర్‌ జూమ్‌

Monday 3rd February 2020

క్యూ3 ఫలితాల ప్రభావం 12 శాతం పడిన గార్డెన్‌ రీచ్‌ 4 శాతం జంప్‌చేసిన థైరోకేర్‌ ఊగిసలాట మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనువెంటనే జోరందుకున్నప్పటికీ తిరిగి డీలాపడ్డాయి. స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా కదులుతున్నాయి. ఉదయం 9.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 18 పాయింట్లు క్షీణించి 39,717కు చేరగా.. నిఫ్టీ 14 పాయింట్లు బలపడి 11,676 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 3rd February 2020

అమెరికా డాలర్‌ బలహీన పడడంతో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో ముగింపు ధరతో పోలిస్తే రూ.263 తగ్గి  10గ్రాముల బంగారం ధర రూ.40,985.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 3 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. (శనివారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

Most from this category