News


ఆంధ్రప్రదేశ్‌లో 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌

Saturday 14th December 2019
news_main1576296546.png-30223

  • 5 వేల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 971 కంపెనీలు స్ట్రయిక్‌ ఆఫ్‌ అయ్యాయి. 2016–17, 2017–18 వరుసగా రెండేళ్లు వార్షిక రిటర్న్‌లు, బ్యాలెన్స్‌ షీట్లను ఫైల్‌ చేయని కారణంగా సెక్షన్‌ 248 ప్రకారం ఈ కంపెనీలను స్ట్రయిక్‌ ఆఫ్‌ చేసినట్లు ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌ (ఐసీఎల్‌ఎస్‌) సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. తొలిసారిగా ఈ సారి స్ట్రయిక్‌ ఆఫ్‌ అయిన కంపెనీల బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసినట్లు చెప్పారాయన. కంపెనీల డేటాతో పాటు బ్యాంక్‌ అకౌంట్, పాన్‌ నంబర్ల వివరాలను ఇండియన్‌ బ్యాంక్‌ అసోసియేషన్, ఆర్‌బీఐ, ఐటీ, జీఎస్‌టీ కార్యాలయాలకు పంపించామని పేర్కొన్నారు.
5 వేల మంది డైరెక్టర్లు డిస్‌క్వాలిఫై...
2015–16, 2016–17, 2017–18 వరుసగా మూడేళ్ల పాటు బ్యాలెన్స్‌ షీట్లను సమర్పించని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 5 వేల మంది డైరెక్టర్లను అనర్హులుగా (డిస్‌క్వాలిఫై) ప్రకటించారు. 2024 అక్టోబర్‌ వరకూ ఆయా డైరెక్టర్లు అనర్హులుగానే ఉంటారని.. వీరిలో ఎవరైనా ఇతర కంపెనీల్లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తే ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ.5 లక్షలు జరిమానా ఉంటుందని వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) వర్గాలు తెలిపారు. డిస్‌క్వాలిఫై అయిన వారిలో అక్షయ గోల్డ్, అగ్రిగోల్డ్‌ వంటి కంపెనీల డైరెక్టర్లున్నారు.



You may be interested

పేటీఎమ్‌కు రూ.4,724 కోట్ల పెట్టుబడులు

Saturday 14th December 2019

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌ మరోసారి నిధులు సమీకరించింది. పేటీఎమ్‌ మాతృసం‍స్థ, వన్‌97 కమ్యూనికేషన్స్‌ రూ.4,724 కోట్లు(66 కోట్ల డాలర్లు) సమీకరించిందని, చైనా అన్‌లైన్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపేతో పాటు టి రొవె ప్రైస్‌ నిర్వహణలోని ఫండ్స్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌కు చెందిన ఎస్‌వీఎఫ్‌ పాంథర్‌(కేమ్యాన్‌) ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిసింది. ఈ వివరాలను బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫార్మ్‌ టోఫ్లర్‌ పేర్కొంది. ఈ విషయమై పేటీఎమ్‌ స్పందించలేదు. కాగా

ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు

Saturday 14th December 2019

2019-20 సంవత్సరంపై సీఏపీఏ తాజా అంచనా న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 600 మిలియన్‌ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను మూటగట్టుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500-700 మిలియన్‌ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను ఈ సంస్థ పూర్తిగా మార్చేసింది. ఇండిగో, గోఎయిర్‌, స్పైస్‌జెట్‌, ఎయిరేషియా ఇండియా,

Most from this category