News


మొబైల్ కొనుగోళ్లు 88 శాతం

Saturday 23rd November 2019
news_main1574491086.png-29808

ముంబై: మొబైల్ ఫోన్‌ వాడకందారుల్లో 88 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, చెల్లింపులను చేస్తున్నారని తాజా సర్వేలో తేలింది. ‘ఎంకామర్స్‌ రిపోర్ట్‌’ పేరిట పేపాల్‌, ఐపీఎస్‌ఓఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ సగటు 77 శాతంగా ఉంటే, ఇంతకుమించి భారతీయులు మొబైల్ ఫోన్లను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నారని తేలింది. ఇందులోనూ, ఏకంగా 98 శాతం మంది యాప్‌ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఇక వచ్చే 12 నెలల్లో మొబైల్ ఆప్టిమైజేషన్‌కు ప్రాధాన్యతను ఇవ్వనున్నామని 45 శాతం మంది వ్యాపారులు చెప్పినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోని 22,000 మంది వినియోగదారులు(18-74 ఏళ్ల మధ్య వయస్సువారు), 4,000 మంది వ్యాపారులను సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. 



You may be interested

సందిగ్థ దశలో మార్కెట్‌!

Saturday 23rd November 2019

స్వల్పకాలానికి కన్సాలిడేషన్‌ లాంగ్‌టర్మ్‌ పాజిటివ్‌ జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అనలిస్టు వినోద్‌ నాయర్‌ దేశీయ మార్కెట్లు సందిగ్దంలో ఉన్నాయని, అందువల్ల సరైన దిశానిర్ధేశం లేకుండా కదులుతున్నాయని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. బలహీన గణాంకాలు, అధిక వాల్యూషన్ల నేపథ్యంలో సూచీలు కొంతకాలం కన్సాలిడేషన్‌ దశలోనే ఉంటాయన్నారు. సంవత్సరానికి నిఫ్టీ టార్గెట్‌ 12600 పాయింట్లుగా నిర్ణయించుకున్నామన్నారు. నిఫ్టీ ప్రస్తుతం ఏడాది ఫార్వర్డ్‌ పీఈ 26 రెట్ల వద్ద వద్ద ట్రేడవుతోందని చెప్పారు. అందువల్ల స్వల్పకాలానికి ముందుకు

రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాలి: శక్తికాంతదాస్‌

Saturday 23rd November 2019

ముంబై: రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌. స్థానిక సంస్థలు వాటి ఆదాయార్జన సామర్థ్యాలను పెంచుకునేందుకు సాయం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్రం, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే దేశ సమాఖ్య సారాంశం. ఎటువైపు బలహీనత ఉన్నా అది దేశానికి సవాళ్లను విసురుతుంది. వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా దాస్‌ పేర్కొన్నారు. 

Most from this category