News


ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..

Friday 15th November 2019
news_main1573788653.png-29601

  • మాన్‌స్టర్‌ వేతన సూచీలో ఆసక్తికర విషయాలు

ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్‌స్టర్‌ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016 జనవరి నుంచి 2018 డిసెంబర్‌ వరకు మూడేళ్ల కాలంలో వేతన చెల్లింపుల డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఉద్యోగం పట్ల అంత సంతోషంగా ఉండడానికి, సహచర ఉద్యోగులు, ఉన్నతోద్యోగులతో వారికున్న మంచి సంబంధాలే కారణమట. నిర్మాణ రంగం, టెక్నికల్‌ కన్సల్టెన్సీ, హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌, సామాజిక సేవ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సర్వీసెస్‌, న్యాయ, మార్కెట్‌ కన్సల్టెన్సీ రంగాల్లోని వారు తమ ఉద్యోగాల పట్ల ఎక్కువ సంతృప్తితో ఉన్నారు. న్యాయ, మార్కెట్‌ కన్సల్టెన్సీ రంగాల్లో ఇది అత్యధికంగా 84 శాతం మేర ఉంది. అలాగే, నిర్మాణం, టెక్నికల్‌ కన్సల్టెన్సీ రంగాల్లోనూ సంతృప్తికర స్థాయి 83 శాతం మేర ఉంది. ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సర్వీసెస్‌లో సంతృప్తికర స్థాయి వృద్ధి ఎక్కువగా ఉంది. విద్య, పరిశోధన రంగాల్లో ఇది ఎక్కువగా తగ్గి 2018లో 53 శాతానికి చేరింది. 



You may be interested

ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 6 లక్షల కోట్లు

Friday 15th November 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ. అయినప్పటికీ బడ్జెట్‌లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సత్వరం రీఫండ్స్ చేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే

ప్రత్యేక సంస్థగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌?

Friday 15th November 2019

అధ్యయనం చేస్తున్న తపాలా శాఖ కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ను (పీఎల్‌ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ గౌతమ్‌ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్‌ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థలు,

Most from this category