News


రెడ్డీస్‌ నుంచి ఐదేళ్లలో 70 ఔషదాలు

Friday 22nd November 2019
news_main1574394572.png-29775

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) వచ్చే ఐదేళ్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్‌ వంటి తూర్పు ఆసియా దేశాల్లో 70కి పైగా ఔషధాలను విడుదల చేయాలని లక్ష్యించింది. ఇప్పటికే ఆయా ఉత్పత్తుల్లో కొన్ని మందుల తయారీని స్థానిక పార్టనర్స్‌కు ఔట్‌ సోర్సింగ్‌ కూడా చేసింది. ప్రస్తుతం చైనా మార్కెట్లలో 8–10 ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని,  వాటన్నిటికీ సంబంధించి కుష్‌నన్‌ రొట్టం రెడ్డి ఫార్మాసూటికల్స్‌తో (కేఆర్‌ఆర్‌పీ) భాగస్వామ్యం ఉందని డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రతినిధి తెలియజేశారు. ష్రిజోఫ్రినియా, బైపోలార్‌ వంటి మానసిక పరిస్థితుల చికిత్సలో ఉపయోగించే ఓలాన్‌జాపైన్‌ ఔషధాన్ని 2020 నుంచి చైనాలో ప్రారంభిస్తామని చెప్పారాయన. 



You may be interested

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Friday 22nd November 2019

మార్కెట్లు శుక్రవారం సెషన్‌లో స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌  26.17 పాయింట్లు నష్టపోయి 40549.00 పాయింట్ల వద్ద ప్రారంభమవ్వగా, నిఫ్టీ 18 పాయింట్ల కోల్పోయి 11950.40 వద్ద ప్లాట్‌గా ప్రారంభమయ్యింది. ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభపడిన షేర్లలో ముందుండగా, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయిన షేర్లలో ముందున్నా‍యి. మొత్తంగా నిఫ్టీ 50లో 21 షేర్లు పాజిటివ్‌గా ప్రారంభమవ్వగా, 29 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

కిడ్‌జీపై కన్నేసిన యూరోకిడ్స్‌

Friday 22nd November 2019

సొంతం చేసుకునేందుకు చర్చలు రూ.1000-1200 కోట్లు ఆఫర్‌ ఇటీవలే యూరోకిడ్స్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్‌ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ విద్యా రంగంలో​మరింత బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. జీలెర్న్‌కు చెందిన కిడ్‌జీ విభాగం పట్ల యూరోకిడ్స్‌ ఆసక్తిగా ఉన్నది. కేకేఆర్‌ భాగస్వామిగా ఉన్న యూరోకిడ్స్‌ ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. కిడ్‌జీ అన్నది ప్రీస్కూల్స్‌ ప్లాట్‌ఫామ్‌. డీల్‌ విలువ రూ.1,000-1,200 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. డీల్‌ కుదిరితే

Most from this category