News


డిస్కౌంట్‌లో ట్రేడవుతున్న ఆరు రంగాలు

Monday 17th June 2019
news_main1560768063.png-26357

ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరిపేందుకు ప్రధానంగా పరిశీలించే వాటిలో వాల్యూషన్లు కీలకమైనవి. విజయవంతమైన ట్రేడర్లంతా వాల్యూషన్ల ప్రాముఖ్యాన్ని గుర్తించినవారే. ప్రీమియం వాల్యూషన్లకు చేరినప్పుడు విక్రయించడం, డిస్కౌంట్‌ వాల్యూషన్ల సమయంలో కొనుగోళ్లు జరపడం ట్రేడర్లు చేస్తుంటారు. ప్రస్తుత మార్కెట్లో ఆరు రంగాలు తమ దీర్ఘకాలిక సరాసరి కన్నా తక్కువ వాల్యూషన్‌కు ట్రేడవుతున్నాయని నిపుణులు గుర్తించారు. వీటిలో క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ఱ, ఇన్‌ఫ్రా, మీడియా, మెటల్స్‌ ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. ఈ రంగాల పదేళ్ల సరాసరి పీఈతో పోలిస్తే ప్రస్తుత పీఈ డిస్కౌంట్‌లో ఉందని బ్రోకరేజ్‌ సంస్థ తన రిసెర్చ్‌ నివేదికలో పేర్కొంది. 
- క్యాపిటల్‌ గూడ్స్‌: ఈ రంగ పదేళ్ల సరాసరి పీఈ మల్టిపుల్‌ 26.9 రెట్లుండగా, ప్రస్తుత పీఈ 9 శాతం డిస్కౌంట్‌తో 24.5 వద్ద ఉంది. ఈ రంగ పీబీ(ప్రైస్‌ టు బుక్‌) సైతం పదేళ్ల సరాసరికి 6 శాతం డిస్కౌంట్‌లో ఉంది. 
- మెటల్స్‌: ఈ రంగ పదేళ్ల సరాసరి పీఈ 12.3 ఉండగా, ప్రస్తుత పీఈ 19 శాతం డిస్కౌంట్‌తో 9.9 వద్ద ఉంది. పీబీ 23 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 
ఇతర రంగాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

అయితే కేవలం వాల్యూషన్లు దీర్ఘకాలిక సరాసరితో పోలిస్తే డిస్కౌంట్‌లో ఉన్నాయన్న ఏకైక కారణంతో వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చా? అని కొత్త మదుపరులు సందేహపడుతుంటారు. డిస్కౌంట్‌లో ట్రేడయ్యే ప్రతి సెక్టార్‌ దీర్ఘకాలంలో ర్యాలీ జరపాలని లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం డిస్కౌంట్‌లో ఉన్న ఈ ఆరు రంగాల్లో ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు మాత్రమే ఇతర పారామీటర్ల పరంగా కూడా ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. మిగిలిన రంగాలు వాల్యూషన్ల పరంగా తక్కువగా ఉన్నా, ఇతర పారామీటర్ల ప్రకారం ఇంకా ట్రెండ్‌రివర్సల్‌ సంకేతాలు ఇవ్వడం లేదంటున్నారు. ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌గూడ్స్‌ రంగాలు మాత్రం ఇబ్బందులు దాటుకొని బయటకు వచ్చాయని, త్వరలో ఈ రెండు రంగాలు మంచి ప్రదర్శన చూపుతాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

మదుపరులు కేవలం వాల్యూషన్లే కాకుండా ఇతర పారామీటర్లు, ఇండికేటర్లు పరిశీలించిన పిమ్మటే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 



You may be interested

11780 పైన క్లోజయితేనే అప్‌మూవ్‌కు అవకాశం

Monday 17th June 2019

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా గతవారమంతా 11800- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ ఈ వారం ఆరంభంలో ఈ రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపింది. సోమవారం కీలక 11800 పాయింట్లను కోల్పోయి 11672 పాయింట్ల వద్ద క్లోజయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11770 పాయింట్లను కోల్పోయినందున స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 11780 పాయింట్ల పైన బలంగా క్లోజయితేనే తిరిగి 12050 పాయింట్లను చేరవచ్చని నార్నోలియా

ఎన్‌బీఎఫ్‌సీలపై ఎఫ్‌ఐఐలు బుల్లిష్‌

Monday 17th June 2019

లిక్విడిటీ ఆందోళనలతో ఒకపక్క ఎన్‌బీఎఫ్‌సీ రంగం కొట్టుమిట్టాడుతుండగా ఎఫ్‌ఐఐలు మాత్రం ఈ రంగంపై మక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మేనెల్లో ఎఫ్‌ఐఐలు ఈ రంగానికి చెందిన దాదాపు రూ. 4వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. మేనెల్లో ఎఫ్‌ఐఐలు 20 రంగాల్లో వాటాలను పెంచుకున్నాయి, 15 రంగాల్లో వాటాలను తగ్గించుకున్నాయని గణాంకాలు చూపుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు బీమా, క్యాపిటల్‌గూడ్స్‌ రంగాల్లో ఎఫ్‌పీఐలు ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. బీమా రంగానికి చెందిన

Most from this category