News


2022లో కస్టమర్లకు 5జీ సేవలు

Tuesday 26th November 2019
Markets_main1574738941.png-29850

  •  ఎరిక్సన్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవల సబ్‌స్క్రిప్షన్‌కు మరో రెండేళ్ల సమయం పడుతుందని స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ అంచనావేసింది. చందాదారులకు ఈ సేవలు 2022లో అందుబాటులోకి రానున్నాయని ఎరిక్సన్‌ మొబిలిటీ రిపోర్ట్‌ (ఈఎంఆర్‌) పేరిట తాజాగా విడుదలచేసిన నివేదికలో పేర్కొంది. సేవలు ప్రారంభమైన దగ్గర నుంచి 2025 నాటికి మొత్తం చందాదారుల్లో 11 శాతం 5జీ కనెక్షన్లను కలిగి ఉంటారని, 80 శాతం మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లు ఎల్‌టీఈని కలిగి ఉంటాయని అంచనాకట్టింది. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ సగటు నెలవారీ ట్రాఫిక్ 2025 నాటికి 24జీబీకి చేరనుందని విశ్లేషించింది. 



You may be interested

విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!

Tuesday 26th November 2019

యాక్సిస్‌, స్టాన్‌చార్ట్‌ సీఈవోలకు ఎన్‌సీఎల్‌టీ హెచ్చరిక ముంబై: ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్‌ బ్యాంక్‌, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్‌ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో

సాల్‌కాంప్‌ చేతికి నోకియా చెన్నై ప్లాంటు

Tuesday 26th November 2019

పదేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న ఫ్యాక్టరీ 2020 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభం కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: ఒకప్పటి మొబైల్స్ దిగ్గజం నోకియాకు చెందిన చెన్నై ప్లాంటును మొబైల్ చార్జర్ల తయారీ సంస్థ సాల్‌కాంప్ కొనుగోలు చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ఆయన సోమవారం తెలిపారు. దాదాపు పదేళ్లుగా మూతబడి ఉన్న ఈ ఫ్యాక్టరీని

Most from this category