News


జియో-బీపీ బ్రాండ్‌ పేరుతో పెట్రోల్‌ బంకులు

Tuesday 17th December 2019
news_main1576553931.png-30262

న్యూఢిల్లీ: ఇంధన రిటైల్‌ విభాగంలో వ్యాపారం విషయమై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీ పీఎల్‌సీ సోమవారం ఒప్పందం చేసుకున్నాయి. ఆగస్ట్‌లో చేసుకున్న ఒప్పందానికి కొనసాగింపుగా తప్పనిసరి ఒప్పందానికి వచ్చాయి. 2020 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో జాయింట్‌ వెంచర్‌ కార్యరూపం దాల్చవచ్చని అంచనా. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిని కూడా జాయింట్‌ వెంచర్‌ కిందకు తీసుకురానున్నారు. మొత్తం 5,500 విక్రయ కేంద్రాలకు విస్తరించాలన్నది లక్ష్యం. జాయింట్‌ వెంచర్‌లో ఆర్‌ఐఎల్‌కు 51 శాతం, మిగిలిన వాటా బీపీకి ఉంటుంది. 49 శాతం వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. 



You may be interested

రివ్వుమన్న నిత్యావసర వస్తువుల టోకు ధర

Tuesday 17th December 2019

రివ్వుమన్న నిత్యావసర వస్తువుల టోకు ధర నవంబర్లో 0.58 శాతం పెరిగిన టోకు ద్రవ్యోల్బణం స్పష్టంగా కనిపిస్తున్న డిమాండ్‌ రహిత స్థితి న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌ గణాంకాలు వ్యవస్థలో మందగమన స్థితికి అద్దం పట్టాయి. ధరల స్పీడ్‌ కేవలం 0.58 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 నవంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో అదే బాస్కెట్‌ ధర కేవలం 0.58 శాతమే పెరిగిందన్నమాట. అయితే

ఐఓసీని అధిగమించిన రిలయన్స్‌

Tuesday 17th December 2019

ఫార్చ్యూన్‌ ఇండియా- 500లో అగ్రస్థానం 2018-19లో రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయం వృద్ధిలో ఐఓసీ కంటే 8.4 శాతం అధికం న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో ఘనతను సాధించింది. తాజాగా ఫార్చ్యూన్‌ ఇండియా- 500 జాబితాలో అగ్ర స్థానానికి చేరుకుంది. ఆదాయం పరంగా వెలువడిన ఈ జాబితాలో ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను  (ఐఓసీ) వెనక్కు నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018-19 ఆర్థిక

Most from this category