News


స్వదేశీ బ్రాండ్లకే మనోళ్లు మొగ్గు..!

Wednesday 16th October 2019
news_main1571198215.png-28910

  • స్వదేశీ బ్రాండ్లకే భారత వినియోగదారుల మొగ్గు 
  • బీసీజీ సంస్థ సర్వేలో వెల్లడి 

ముంబై: భారత వినియోగదారుల్లో దాదాపు సగం మంది విదేశీ బ్రాండ్ల కంటే స్వదేశీ బ్రాండ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ, బీసీజీ వెల్లడించింది. భారత వినియోగదారులు ఆహారం, వ్యక్తిగత సంరక్షణ కేటగిరీల్లో స్వదేశీ బ్రాండ్లకే మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని బీసీజీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాజకీయంగా జాతీయత వాదం బలం పుంజుకుంటున్న వేళ, దేశీ వస్తువులనే కొనుగోలు చేయాలంటూ ప్రచారాలు మోతెక్కిపోతున్న వేళలో, ఈ సర్వే వెలువడటం విశేషం. దాదాపు 3,000 మంది భారతీయులపై నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు....

  • కనీసం ఒక్క కేటగిరీలోనైనా భారత బ్రాండ్‌ వస్తువులను కొనుగోలు చేయాలని వినియోగదారులు భావిస్తున్నారు. 
  • తాము కొనుగోలు చేసిన వస్తువుల ద్వారా సామాజిక గుర్తింపు పొందాలని కోరుకునే వినియోగదారులే అధికంగా ఉన్నారు. 
  • బ్రాండ్ల వస్తువుల ద్వారా తాము పొందిన తృప్తిని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్ల ద్వారా వెల్లడించడానికి వినియోగదారులు వెనకాడటం లేదు. 



You may be interested

7% కాదు... 6.1 శాతమే!

Wednesday 16th October 2019

2019 భారత్‌ వృద్ధిరేటుకు ఐఎంఎఫ్‌ కోత ఆటోమొబైల్‌, రియల్టీసహా  పలు రంగాలు ప్రతికూలం నాన్‌-బ్యాంక్‌ ఫైనాన్షియల్‌  కంపెనీల పరిస్థితీ అనిశ్చితే! వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్న పలు సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కూడా చేరింది. 2019లో వృద్ధి కేవలం 6.1 శాతంగానే నమోదవుతుందని తన వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఏప్రిల్‌ అంచనా (7.3 శాతం)తో పోల్చితే తాజా అంచనా ఏకంగా 1.2 శాతం తక్కువ. నిజానికి ఏప్రిల్‌లో

టెల్కోల చార్జీలకు రెక్కలు!

Wednesday 16th October 2019

 ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావంటున్న కంపెనీలు టారిఫ్ పెరిగితే తప్ప కష్టం ఎయిర్‌టెల్‌ ఎండీ విఠల్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్‌టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో (భారత్‌, దక్షిణాసియా విభాగం) గోపాల్

Most from this category