News


ఫార్మా షేర్లపై ‘‘పాంచ్‌’’ పంచ్‌లు!

Tuesday 11th February 2020
news_main1581412947.png-31694

దేశీయ ఫార్మా కంపెనీల షేర్లను ఐదు అంశాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1. యూఎస్‌ జనరిక్స్‌ వ్యాపారం: అమెరికాలో జనరిక్స్‌ వ్యాపారం ఇంకా ఇక్కట్ల నుంచి బయటకు రాలేదు. ఒకప్పుడు ఫార్మా కంపెనీలన్నీ జనరిక్స్‌ వ్యాపారంలో భారీగా లాభాలు పొందాయి. కానీ అక్కడ ఈ వ్యాపారంపై నియంత్రణా నిబంధనలు పెరగడంతో జనరిక్స్‌ మార్కెట్‌ దెబ్బతిన్నది. దీనికితోడు కొత్తగా పెద్ద ఉత్పత్తుల లాంచింగ్‌లు లేకపోవడం, ఆర్‌అండ్‌డీ వ్యయాలు తగ్గడం, అనుమతుల్లో జాప్యం, పెరిగిన పోటీ.. దేశీయ కంపెనీలకు యూఎస్‌ జనరిక్‌ మార్కెట్లో సవాళ్లుగా నిలిచాయి. ఈ పరిస్థితులు ఇంకా పూర్తిగా మారలేదు.
2. అధిక వ్యయాలు: సిబ్బంది వేతనాలతో పాటు ఇతర వ్యయాల పెరుగుదల దేశీయ డ్రగ్‌ కంపెనీల లాభాలపై భారం మోపింది. ప్రమోషన్ల ఖర్చులు పెరగడం, ఆర్‌అండ్‌డీ వ్యయాల పెరుగుదల, నియంత్రణా సంస్థల విజిట్లు, వాటి సూచనల మేర చేయాల్సిన మార్పులు.. ఇలా అనేక వ్యయాలు పెరిగాయి. సమీప భవిష్యత్‌లో ఈ వ్యయాలు మరింత పెరుగుతాయి కానీ దిగివచ్చే అవకాశాలు లేవని నిపుణుల అంచనా. 
3. ఆర్‌అండ్‌డీ అంతంతే: సిప్లా సహా చాలా కంపెనీలు కొత్త రిసెర్చ్‌లపై వ్యాలు తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే పోర్టుఫోలియోలో ఉన్న మాలిక్యూల్స్‌ ఉత్పత్తిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదలలు క్షీణిస్తున్నాయి. సన్‌ఫార్మా, అరబిందో లాంటి కంపెనీలు మాత్రం ఆర్‌అండ్‌డీపై వ్యయాలు పెంచుకుంటామని చెప్పాయి. 
4. కొత్త వ్యూహాలు: కంపెనీలు వ్యాపార మెరుగుదలకు అవలంబిస్తున్న కొత్త వ్యూహాలు ఇంకా ఫలితాలు ఇవ్వడం లేదు. ఉదాహరణకు సన్‌ ఫార్మా స్పెషాలిటీ ఉత్పత్తులపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని, అరబిందో వ్యాపార విస్తరణ చేపట్టాలని, డా.రెడ్డీస్‌ నాన్‌ కోర్‌ ఆస్తులు విక్రయించాలని.. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో వ్యూహం రచించుకుంది. ఇవన్నీ ఇంకా పూర్తి ఫలితాలు ఇవ్వలేదు.
5. ఇన్వెస్టర్ల సీతకన్ను: ఫార్మా కంపెనీలు పునర్వైభవ సాధన యత్నాల్లో ఉండగా ఇన్వెస్టర్లు వీటిపై పెద్దగా బుల్లిష్‌ ధోరణి చూపడం లేదు. ఫార్మా రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటోందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో పలు బ్రోకరేజ్‌లు సైతం వీటిని పెద్దగా రికమండ్‌ చేయడంలేదు. చాలా కంపెనీల షేర్ల టార్గెట్‌ ధరలు వాటి ప్రస్తుత ధరల కన్నా కేవలం 10 శాతం మాత్రమే అధికంగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. You may be interested

డీమార్ట్‌, నెస్లే.. తగ్గితే కొనొచ్చు?!

Tuesday 11th February 2020

సిగరెట్ల బిజినెస్‌ విడదీస్తే.. ఐటీసీ భేష్‌  స్టీల్‌ కంపెనీలపట్ల ఆసక్తి లేదు - దేవంగ్‌ మెహతా, ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌, సెంట్రమ్‌ ఇండియా ప్రపంచ మార్కెట్లు సరికొత్త రికార్డులను చేరుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొస్తున్నట్లు సెంట్రమ్‌ ఇండియా ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌ దేవంగ్‌ మెహతా పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)కు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో లార్జ్‌ క్యాప్స్‌తోపాటు.. మిడ్‌ క్యాప్‌ కౌంటర్లూ లాభపడనున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ముడిచమురు ధరలు తగ్గితే పలు

వొకార్డ్‌.. ఒకటే స్పీడ్‌.. ఎందుకంటే?

Tuesday 11th February 2020

12 శాతం దూసుకెళ్లిన షేరు నెల రోజుల్లో 65 శాతం జూమ్‌ 7 నెలల గరిష్టానికి షేరు క్యూ3 ఫలితాలు, ఔషధ అనుమతుల ఎఫెక్ట్‌ ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతంపైగా దూసుకెళ్లి రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 412 వరకూ ఎగసింది. ఇది 7

Most from this category