News


చమురు ధరల పతనం.. వీటికి లాభం

Tuesday 24th March 2020
news_main1585072649.png-32656

కోవిడ్‌ వైరస్‌ కారణంగా చమురుకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు సౌదీ, రష్యాల మధ్య చమురు ఉత్పత్తి కోత విషయమై ఏకాభిప్రాయం రాకపోవడం.. దాంతో సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించేయడం చూశాం. దీంతో చమురు ధరలు బ్యారెల్‌కు 25 డాలర్ల వరకు ఇటీవల పడిపోయాయి. 2003 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ ధరలను చూడడం మళ్లీ ఇదే మొదటిసారి. ఈ ఏడాది జనవరిలో చూసిన గరిష్ట ధరల నుంచి 65 శాతం పడిపోయాయి. చమురు ధరల పతనం భారత్‌కు సానుకూలం. ఎందుకంటే మన దేశ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. కనుక చమురు ధరల క్షీణత మన దిగుమతి బిల్లును తగ్గించడమే కాదు.. ఎన్నో రంగాలకూ ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

 

ఆయిల్‌ మార్కెటింగ్‌, పెయింట్‌, టైర్‌ కంపెనీలు చమురు ధరలు తక్కువ స్థాయికి చేరడం వల్ల ఎక్కువగా లాభపడే రంగాలుగా అనలిస్టులు పేర్కొంటున్నారు. ‘‘చమురు ధరలు దిగిరావడం వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, పెయింట్స్‌, టైర్‌ రంగాలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయి. పెయింట్‌, ఎంపిక చేసిన టైర్‌ కంపెనీలను ఈ సమయంలో కొనుగోలు చేయాలని సూచిస్తున్నాం. అయితే, చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు దూరంగా ఉండాలన్నది సూచన. ఎందుకంటే కరోనా వైరస్‌ కారణంగా డిమాండ్‌ తగ్గుతుంది’’అని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌కు చెందిన రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ పేర్కొన్నారు. ‘‘సాధారణంగా చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు తక్కువ ధరలతో ప్రయోజనం. అయితే పెయింట్‌, టైర్‌ కంపెనీలకూ ముడి సరుకు చమురు కావడంతో అవి కూడా బాగానే లాభపడతాయి’’ అని ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన ఏకే ప్రభాకర్‌ తెలిపారు.

 

ఆటోమొబైల్‌ రంగానికి కూడా చమురు ధరలు తగ్గడం ప్రయోజనకరమే అయినా.. లాక్‌డౌన్‌ సమయంలో వాహనాల కొనుగోలు నిలిచిపోతుంది కనుక ఆ ప్రయోజనం ఇప్పుడు నెరవేరదు. ఎఫ్‌ఎంసీజీ, వినియోగ రంగాల కంపెనీలకూ చమురు ధరలు తగ్గడం వల్ల ముడి సరుకులు, ప్యాకేజీ ఖర్చులు తగ్గుతాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌జేమ్స్‌ తెలిపారు. చమురు ధరలు తగ్గడం అన్ని రంగాలకు ఏదో విధంగా ప్రయోజనమేనని, మార్కెట్లు రికవరీ అయితే అన్ని రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందన్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌ స్టాక్స్‌ను గౌరవ్‌గార్గ్‌ సూచించారు. హెచ్‌పీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ స్టాక్స్‌ను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌కు చెందిన రీసెర్చ్‌ హెడ్‌ వినీత్‌శర్మ సూచించారు. ‘‘చమురు ధరలు తగ్గడం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు సబ్సిడీ భారం తగ్గుతుంది. మూలధన విస్తరణ ప్రణాళికల దృష్ట్యా హెచ్‌పీసీఎల్‌ ఆకర్షణీయంగా ఉంది’’అని వినీత్‌ సూచించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోవిడ్‌ వైరస్‌ ఒక్కసారి సమసిపోతే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్థూల రిఫైనరీ మార్జిన్లు మెరుగుపడతాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.You may be interested

ప్రతికూల ఓపెనింగ్‌ నేడు!

Wednesday 25th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 205 పాయింట్లు డౌన్‌ ఆసియా మార్కెట్లు 2-6 శాతం ప్లస్‌ మంగళవారం అమెరికా మార్కెట్లు జూమ్‌ అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ నష్టాల్లో మంగళవారం యూరప్‌ ఇండెక్సుల జోరు నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.10 ప్రాంతం‍లో 205 పాయింట్లు పతనమై 7,705 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 7,910 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌

షార్ట్‌ సెల్లింగ్‌ వల్లే ఇంత నష్టం: దేవేన్‌ ఆర్‌ చోక్సీ

Tuesday 24th March 2020

ప్రస్తుత సంక్షోభం కూడా సమసిపోయేదేనని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ఎండీ దేవేన్‌ చోక్సీ అన్నారు. కాకపోతే, ప్రస్తుతం చూస్తున్నది అసాధారణ పరిస్థితి అని, ప్రపంచమంతా మూతపడుతుండడాన్ని చూస్తున్నామని పేర్కొన్నారు. కనుక ఇటువంటి పరిస్థితి మొదటి సారిగా వచ్చిందన్నారు. అయితే, దీన్నుంచి బలంగా బయటకొస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వ్యాపార మూలాలు ఒక పరిమితికి మించి పెద్దగా నష్టపోవన్నారు. అయితే, మన మార్కెట్లు దాదాపు నష్టాన్ని

Most from this category