News


తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు

Tuesday 31st December 2019
news_main1577766470.png-30549

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో రూ.3,80,700 కోట్లతో రిలయన్స్‌ చీఫ్‌ ముకేశ్‌ అంబానీ భారత్‌లో అపర కుబేరుడుగా నిలిస్తే, ఇదే జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు బిలియనీర్లకూ స్థానం దక్కింది. అరబిందో ఫార్మా చైర్మన్‌ పీవీ రాంప్రసాద్‌ రెడ్డికి(రూ.14,800 కోట్లు) 51వ స్థానం లభించగా, ఎంఈఐఎల్‌ చైర్మన్‌, ఎండీలు పి. పిచ్చిరెడ్డి (రూ.13,400),  పీవీ కృష్ణారెడ్డి (రూ12,900 కోట్లు)లు 57, 63 స్థానాల్లో నిలిచారు. ఇక దివీస్‌ ల్యాబ్స్‌- దివి సత్చంద్ర కిరణ్‌ (రూ.10,200 కోట్లు) , నీలిమ మోటపర్తి (రూ.9,800 కోట్లు) 83, 89 స్థానాల్లో ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిష్టాత్మక ఫోర్బ్స్‌ ఇండియా మేగజైన్‌..  ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌ 2019’లో ఎంఈఐఎల్‌ చైర్మన్‌ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో  ‘మేఘా బిల్డర్‌’ పేరుతో ప్రచురించిన ఈ వ్యాసంలో సంస్థ పురోగతిని వివరించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి  ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 39వ స్థానంలో నిలవడం చెప్పుకోదగిన మరో విశేషం. 



You may be interested

కొనేవారు రాకుంటే .. ఎయిరిండియా మూసివేతే

Tuesday 31st December 2019

ఆందోళనలో కంపెనీ వర్గాలు ముంబై: వచ్చే ఏడాది జూన్‌లోగా కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోయిన పక్షంలో ప్రభుత్వ రంగ విమానయాన రంగ సంస్థ ఎయిరిండియా మూసివేత తప్పదని కంపెనీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిర్వహణ వ్యయాల అవసరాల కోసం రూ. 2,400 కోట్లు సమీకరించుకోవడానికి తగినంత పూచీకత్తు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం కేవలం రూ. 500 కోట్లకు మాత్రమే హామీనిచ్చిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి కార్యకలాపాలు

బ్యాంకింగ్‌లో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం డౌన్‌

Tuesday 31st December 2019

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 0.5 శాతం నీరసించింది. వెరసి వరుసగా రెండో రోజు బ్యాంకింగ్‌ కౌంటర్లు వెనకడుగు వేస్తున్నాయి. ఉదయం 9.40 ప్రాంతం‍లో బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1-0.5 శాతం మధ్య క్షీణించాయి.

Most from this category