News


అగ్రస్థానానికి జియో

Friday 17th January 2020
news_main1579235227.png-30985

  • 36.9 కోట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. దిగ్గజ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలను వెనక్కి నెట్టి అనతికాంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. గతేడాది నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. ఒక్క నవంబర్‌ నెల్లోనే 56 లక్షల మంది నూతన సబ్‌స్క్రైబర్లు జతకావడంతో సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఇక ఆ తరువాత స్థానంలో ఉన్న వొడాఫోన్‌ ఐడియా చందాదారుల సంఖ్య 33.62 కోట్లు కాగా, భారతీ ఎయిర్‌టెల్‌ కస్టమర్ల సంఖ్య 32.73 కోట్లుగా ఉన్నట్లు తాజా డేటాలో వెల్లడైంది. మరోవైపు మొత్తం టెలికం రంగం చందాదారుల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్‌ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది. 



You may be interested

మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చైనా వృద్ధి రేటు !

Friday 17th January 2020

బీజింగ్‌:  చైనా వృద్ధి రేటు మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చేరింది.  బలహీనమైన దేశీయ డిమాండ్‌తో పాటు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చైనా జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పడిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో  2019 సంవత్సరంలో 6.1 శాతం జి.డి.పి వృద్ధిరేటు నమోదైనట్లు చైనా అధికారిక నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది. ఎన్‌బీఎస్‌ కమిషనర్‌ నింగ్‌ జిజే దీనిపై స్పందిస్తూ... చైనా ఆర్థిక వ్యవస్థ

వొడాఫోన్‌ 30 శాతం క్రాష్‌...ఎయిర్‌టెల్‌ 5 శాతం అప్‌

Friday 17th January 2020

సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీం కోర్డు కొట్టివేయడంతో శుక్రవారం టెలికాం రంగ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంగా, వోడా ఫోన్‌ షేరు మాత్రం భారీ నష్టాన్ని చవిచూసింది. టెలికం కంపెనీలు కట్టాల్సిన లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను మదింపు చేయడానికి ఉద్దేశించిన ఏజీఆర్‌ నిర్వచనం

Most from this category