News


డిసెంబర్‌ 31లోగా మీరు పూర్తిచేయాల్సిన ఆర్థిక వ్యవహారాలు..!

Saturday 28th December 2019
news_main1577523661.png-30496

ఈ 2019 ఏడాది మరో 3రోజుల్లో ముగుస్తుంది. మనలో కొంతమంది సరికొత్త ఎజెండాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మీరు కూడా డిసెంబర్‌ 31లోగా ఈ 3 ఆర్థిక కర్తవ్యాలను పూర్తి చేసుకుని నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకండి. ఇంతకీ ఈ 3 ఆర్థిక కర్తవ్యాలు ఏమిటని ఆలోచిస్తున్నారా..? అయితే పూర్తి వివరాలకు కింద కథనాన్ని చదవండి....

పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోండి:- 
ఈ డిసెంబర్‌ 31వ తేదీకల్లా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోండి. నిర్ణయించిన గడువులోగా పాన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయకపోతే పాన్‌ నెంబరు చెల్లదు. 31వ తేదీ తర్వాత ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.  ఇప్పటి వరకూ కొందరు రిటర్ను దారులు ఆధార్‌ నెంబరును కూడా ఐటి రిటర్నుల్లో పొందుపరచడంలేదు. ఆఫ్‌లైన్‌లోను, ఆన్‌లైన్‌లో కూడా ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ వ్యవస్థను పొందుపరిచింది. ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.  

మీ పాత ఎస్‌బీఐ ఏటీఎం కార్డును మార్చుకొండి:- 
మీరు ఇప్పటికీ ఈఎంవీ చిప్ లేని మ్యాగ్నెటిక్ స్ట్రైప్స్ ఎస్‌బీఐ కార్డునే వినియోగిస్తున్నారా..? అయితే డిసెంబర్ 31 లోగా మార్చాల్సిందే. విధించిన గడువులోగా కార్డులను మార్చుకోకపోతే ఆ తర్వాత మీ ఏటీఎం కార్డులు పనిచేయవు. మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఓసారి చెక్ చేసుకొని, కార్డుపై ఈఎంవీ చిప్ లేకపోతే కొత్త కార్డు కోసం అప్లై చేయాలి. మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డ్ నుంచి ఈఎంవీ చిప్ కార్డుకు మారేందుకు మీరు ఎలాంటి ఫీజు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ ఉచితంగానే కార్డులను అప్‌డేట్ చేస్తుంది. వాస్తవానికి డెడ్‌లైన్ గతంలోనే ముగిసింది. కానీ ఇప్పటికే చిప్ లేని కార్డులు ఉపయోగిస్తున్నవారికి వాటిని మార్చుకోవడానికి మరో అవకాశం ఇచ్చింది. కాబట్టి మీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుకు ఈఎంవీ చిప్ లేకపోతే డిసెంబర్ 31 లోగా మార్చుకోండి.

ఆలస్యమైన ఐటీఆర్‌ను డిసెంబర్‌ 31లోగా ధాఖలు చేయండి:- 
ఆలస్యమైన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్‌) డిసెంబర్‌ 31లోగా ధాఖలు చేయండి. ఈ నిర్ణీత తేదిలోగా ఈ పని పూర్తి చేస్తే రూ.5,000 మిగుల్చుకునే అవకాశం అందుబాటులో ఉంది.  2019-20 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలుకు 2019 ఆగస్ట్ 31తో గడువు పూర్తయ్యింది. ఎవరైతే ఆగస్ట్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయలేదో వారికి పెనాల్టీ పడుతుంది. ఆగస్ట్ 31లోపు ఐటీఆర్ దాఖలు చేయని వారు ఇప్పుడు డిసెంబర్ 31లోపు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాలంటే రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  డిసెంబర్ 31 తర్వాత 2020 మార్చి 31లోపు ఐటీఆర్ దాఖలు చేస్తే అప్పుడు రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది. అందువల్ల ఆగస్ట్‌లో ఐటీఆర్ దాఖలు చేయకపోతే.. ఇప్పుడైనా వెంటనే ఆ పని పూర్తి చేయండి. డిసెంబర్ 31లోపు ఈ పని పూర్తి చేయకపోతే అప్పుడు రూ.5,000 కాకుండా రూ.10,000 పోగొట్టుకోవలసి వస్తుంది. You may be interested

కొత్త ఏడాది అంచనాలు నిలుస్తాయా?!

Saturday 28th December 2019

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాయి. ఇటీవల మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుండటంతో అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వచ్చే వారం మార్కెట్లు గడిచిన వారాన్ని తలపిస్తూ ఒడిదొడుకులు చవిచూసే అవకాశమున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్‌పై అంచనాలతో ఉన్న ఇన్వెస్టర్లు మెటల్స్‌, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ

రానున్న కాలంలో చిన్న షేర్లదే హవా

Saturday 28th December 2019

ఖరీదైన లార్జ్‌క్యాప్స్‌ నుంచి బయటపడుతున్నాం రీజనబుల్‌గా ఉన్న మిడ్‌క్యాప్స్‌వైపు మళ్లుతున్నాం -పంకజ్‌ టిబ్రేవాల్‌  కొటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ కొద్దిపాటి హెవీవెయిట్స్‌తో ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో వచ్చిన ర్యాలీ భవిష్యత్‌లో ఇతర కౌంటర్లకూ విస్తరించనున్నట్లు కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంసైతం పుంజుకోనున్నట్లు చెబుతున్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు

Most from this category