News


అమెజాన్‌ ‘కళా హాత్‌’లో 280 రకాల ఉత్పత్తులు

Saturday 9th November 2019
news_main1573270079.png-29465

  • 2020 చివరికి 500కు చేరుస్తాం
  • ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ తన పోర్టల్‌లో ‘కళా హాత్‌’ పేరిట నిర్వహిస్తున్న స్టోర్‌లో 280 రకాల కళారూపాల తాలూకు ఉత్పత్తులు నమోదయ్యాయని ‘ప్రయాన్‌’ ఎండీ సందీప్‌ వరగంటి చెప్పారు. 2020 చివరి నాటికి 500 రకాల కళారూపాలను ఈ-కామర్స్‌ పోర్టల్‌లో పరిచయం చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారాయన. కాటమరాన్‌ వెంచర్స్‌, అమెజాన్‌ల సంయుక్త కంపెనీ అయిన ప్రయాన్‌... ఈ ‘కళా హాత్‌’ను ప్రమోట్‌ చేస్తోంది. ‘సాధారణంగా విక్రేతల నుంచి అమెజాన్‌ 16 శాతం కమిషన్‌ తీసుకుంటుంది. కళా హాత్‌ కింద నమోదైన విక్రేతలకు ఇది 8 శాతమే. అంతేగాక ప్రతి క్లస్టర్‌లో మా ప్రతినిధి ఒకరు నిరంతరం ఉండి వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందిస్తారు. శిక్షణ కూడా ఇస్తారు. చేనేత, హస్త కళాకారులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు. వారి ఉత్పత్తుల లిస్టింగ్‌, 3డీ మోడలింగ్‌ ప్రక్రియ అంతా మేమే చూసుకుంటాం’ అని శుక్రవారమిక్కడ విలేకరులకు ఆయన వివరించారు. పోచంపల్లి ఇక్కత్‌, మంగళగిరి, కళంకారీ, పశ్మీనా, మధుబని, రోగన్‌, లిప్పన్‌ కామ్‌, ధరీజ్‌ వంటి సంప్రదాయ చేనేత వస్త్రాలన్నీ దీన్లో ఉన్నట్లు తెలియజేశారు. ఇప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో  5,000 పైచిలుకు సంఘాలు, మాస్టర్‌ వీవర్స్‌, గోల్కొండ, లేపాక్షి వంటి సంస్థలతో చేతులు కలిపినట్లు చెప్పారు. 
రాష్ట ప్రభుత్వాలు తోడుంటే...
కళా హాత్‌ కింద నమోదైన చేనేత, హస్త కళాకారులకు ఒక్కొక్కరికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10,000ల నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. ఇటువంటి విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్‌, జమ్మూ, కాశ్మీర్‌, తమిళనాడు ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని సందీప్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నగదుతో ప్రోత్సహిస్తే కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించుకునేందుకు వీలవుతుందని చెప్పారాయన. తెలంగాణ నుంచి 180, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 150 మంది కళాకారులు ప్రస్తుతం కళా హాత్‌ కింద నమోదయ్యారన్నారు. You may be interested

స్నేహపూర్వక పన్ను వ్యవస్థను సృష్టించాలి

Saturday 9th November 2019

పన్నుల శాఖ అధికారులకు ఆర్థికమంత్రి సూచన ఫరీదాబాద్‌: స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు బాటన సాగాలని పన్నుల శాఖ అధికారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రభుత్వానికి-పన్ను చెల్లింపుదారులకు మధ్య అనుసంధానకర్తలుగా తగిన సౌలభ్యత రూపకర్తలుగా వ్యవహరించాలని రెవెన్యూ ఇంటెలిజన్స్‌ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపులకు సంబంధించి చెల్లింపుదారులు ఏ అంశంలోనూ భయాందోళనలకు గురికాని పరిస్థితి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇక్కడి నేషనల్‌ అకాడమీలో జరిగిన ఇండియన్‌ రెవెన్యూ

జనవరి నుంచి నెఫ్ట్‌ చార్జీలకు మంగళం

Saturday 9th November 2019

వసూలు చేయరాదని ‍బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం ముంబై: వచ్చే జనవరి నుంచి సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారులు ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌’ (నెఫ్ట్‌) లావాదేవీలపై ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆర్‌బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల మధ్య ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ అనే రెండు ముఖ్య విధానాలు అమల్లో ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను ఆర్‌బీఐ నిర్వహిస్తుంటుంది. నెఫ్ట్‌

Most from this category