STOCKS

News


మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’

Friday 17th January 2020
news_main1579231718.png-30978

  • బీఎస్‌-6 ప్రమాణాలతో 110 సీసీ స్కూటర్‌
  • ప్రారంభ ధర రూ. 63,912

ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్‌ స్టాండర్డ్‌, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912- 65,412 (ఎక్స్‌-షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మునుపటి మోడలైన స్టాండర్డ్‌ 5జీతో పోల్చితే నూతన స్కూటర్‌ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్‌ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. కొత్త స్కూటర్‌ విడుదల సందర్భంగా కంపెనీ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వై.ఎస్‌ గులేరియా మాట్లాడుతూ.. ‘బీఎస్‌-6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. తొలుత 125, ఆ తరువాత ఎస్‌పీ 125 యాక్టివాలను విడుదల చేయగా.. ఇప్పటి వరకు ఈ నూతన మోడళ్లలో 75,000 యూనిట్లను పంపిణీ చేశాం. ఇక కొత్త 110 సీసీ గేమ్‌ ఛేంజర్‌ కానుందని భావిస్తున్నాం. ఈ నెల చివరినాటికి, లేదంటే.. ఫిబ్రవరి మొదటి వారంలో నూతన స్కూటర్‌ అందుబాటులో ఉండనుంది’ అని అన్నారు. 
ఆటో రంగంలో నిరాశే...
కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్నును (జీఎస్‌టీ) తగ్గించి పరిశ్రమను ఆదుకుంటుందని తాను భావించడం లేదని గులేరియా వ్యాఖ్యానించారు. ఒకవేళ పన్ను రేట్లు తగ్గితే కస్టమర్లకు కచ్చితంగా అది శుభవార్త అవుతుందన్నారు. ప్రస్తుతం దేశీ ఆటో రంగ పరిశ్రమ మందగమనంలోనే కొనసాగుతోందని, కోలుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చనే అంశంపై స్పష్టత లేదని ఆయన విశ్లేషించారు. You may be interested

టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 17th January 2020

ఏజీఆర్‌పై రివ్యూ పిటీషన్‌ డిస్మిస్‌ పునఃసమీక్షకు తగిన కారణాల్లేవని వ్యాఖ్య వడ్డీ, జరిమానాల విధింపు సరైనదేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ

దక్షిణాదిన ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ ప్లాంటు!

Friday 17th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ దక్షిణాదిన ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న అయిదు ప్లాంట్లలో వినియోగం పూర్తి స్థాయికి చేరుకున్నందును కొత్త ఫెసిలిటీ అవసరమని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ జైన్‌  వెల్లడించారు. ఎలిగంజా సిరీస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపాదిత ప్లాంటును ఎక్కడ, ఎంత మొత్తంతో ఏర్పాటు చేసేదీ త్వరలో

Most from this category