News


మార్కెట్లోకి ‘ఇథనాల్‌’తో నడిచే టీవీఎస్‌ అపాచీ

Saturday 13th July 2019
news_main1562991347.png-27030

  • ప్రారంభ ధర రూ.1.2 లక్షలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌’.. తాజాగా తన పాపులర్‌ మోడల్‌ అపాచీలో ‘ఇథనాల్‌’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్‌టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్‌... ఇథనాల్‌ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ పెట్రోల్‌, డీజిల్‌ బైక్‌ల నుంచి నెమ్మదిగా పర్యావరణ అనుకూల ఇంధనాలవైపునకు అడుగులు వేస్తోంది. కంపెనీలు విద్యుత్, హైబ్రిడ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇథనాల్‌ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నాం. ఈ కారణంగానే.. పనితీరులో ఎలాంటి రాజీలేకుండా, నిర్వహణ వ్యయం పెరగని ఈ నూతన బైక్‌ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు.
త్వరలోనే ఇథనాల్‌ పంప్స్‌...
పెట్రోల్‌ బంకుల మాదిరిగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఇథనాల్‌ పంప్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇథనాల్‌ బైక్‌ విడుదల కార్యక్రమానికి హజరైన ఆయన.. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను ఇథనాల్‌ పంప్స్‌ ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. 



You may be interested

విస్తరణలో గోద్రెజ్‌ ఇంటీరియో

Saturday 13th July 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫర్నీచర్‌ రంగ సంస్థ గోద్రెజ్‌ ఇంటీరియో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 2020 మార్చికల్లా కొత్తగా 30 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లు నెలకొల్పుతోంది. అలాగే డీలర్‌ నెట్‌వర్క్‌ ద్వారా 70 షోరూంలు ప్రారంభిస్తున్నట్టు గోద్రెజ్‌ ఇంటీరియో మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుబోధ్‌ కుమార్‌ మెహతా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 16 కేంద్రాలు రానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే కంపెనీకి

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

Saturday 13th July 2019

నికర లాభం రూ.1,433 కోట్లు  మొత్తం ఆదాయం రూ.8,625 కోట్లు  34 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,433 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1.036 కోట్ల నికర లాభం సాధించామని  ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంక్‌లో విలీనమైన సూక్ష్మ రుణ సం‍స్థ,

Most from this category