News


ఐటీలో 2.5 లక్షల కొత్త కొలువులు

Wednesday 3rd July 2019
news_main1562136741.png-26761

  • నైపుణ్యాభివృద్ధి పథకాలతో సాధ్యం
  • కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడి

న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో సమగ్ర నైపుణ్యాభివృద్ధి పథకాల ఊతంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశీయంగా క్లౌడ్‌ కంప్యూటింగ్ మార్కెట్‌ 2022 నాటికల్లా 7.1 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ. 49,000 కోట్లు) చేరనుందని ఆయన చెప్పారు. 2018లో ఇది 2.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,250 కోట్లు)గా ఉంది. వరల్డ్ స్కిల్స్ ఇండియా-ఇంటర్నేషనల్ క్లౌడ్‌ కంప్యూటింగ్ చాలెంజ్‌ 2019 కార్యక్రమం‍లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. రానున్న రోజుల్లో ఐటీ రంగంలో అత్యంత పురోగతి సాధించిన దేశాల సరసన భారత్‌ కూడా నిల్చుంటుందని ఆయన చెప్పారు. ఆధునిక విద్య, నైపుణ్యాలతో నాలుగో పారిశ్రామిక విప్లవ ఫలాలను అందిపుచ్చుకోవాలని యువతకు పాండే సూచించారు. మరోవైపు, వచ్చే మూడు, నాలుగేళ్లలో 20 లక్షల మందికి డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ అందించనున్నట్టు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ చైర్మన్ కేశవ్ మురుగేశ్ ఈ సందర్భంగా చెప్పారు. డేటా భద్రత బిల్లును పార్లమెంటు సత్వరం ఆమోదించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. నాస్కామ్ నిర్వహిస్తున్న ఈ క్లౌడ్ కంప్యూటింగ్ పోటీల్లో జపాన్‌, చైనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా, రష్యా, సింగపూర్‌, బెల్జియం, ఐర్లాండ్ తదితర దేశాల వారు పాల్గొంటున్నారు. 



You may be interested

త్వరలోనే యాడ్‌ల్యాబ్స్‌ సమస్య కొలిక్కి

Wednesday 3rd July 2019

సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం !  ముంబై: యాడ్‌ల్యాబ్స్‌ బకాయిల సమస్య ఈ ఏడాది సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం కానున్నదని సమాచారం. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) లో కాకుండా బయటనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని 13 బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ యాడ్‌ల్యాబ్స్‌కు రూ.1,100 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈ రుణాల వసూళ్ల కోసం ఈ బ్యాంక్‌లు యాడ్‌ల్యాబ్స్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని

డేటా సేకరణ ఆరోపణలు నిరాధారమైనవి: టిక్‌టాక్‌

Wednesday 3rd July 2019

న్యూఢిల్లీ: చట్టవిరుద్ధంగా యూజర్ల డేటాను సేకరిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను షార్ట్-వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఖండించింది. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పేర్కొంది. చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్‌ సంస్థలో భాగమైన టిక్‌టాక్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యూజర్ల డేటా భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించింది. యూజర్ల డేటాను టిక్‌టాక్‌ చట్టవిరుద్ధంగా సేకరించి .. చైనాకు పంపుతోందని, ఇది జాతీయ

Most from this category