News


అక్టోబర్‌లో రూ.2.5 లక్షల కోట్ల రుణాల పంపిణీ

Friday 22nd November 2019
news_main1574393338.png-29772

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ‍ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్‌ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

అక్టోబర్‌లో ఎవరికి ఎంత మేర..

  • కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు
  • వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు
  • ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు
  • గృహ రుణాలు రూ.12,166 కోట్లు
  • వాహన రుణాలు రూ.7,058 కోట్లు
  • ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి రూ.19,627 కోట్లు 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న టెలికం యూజర్లు..

Friday 22nd November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న టెలికం యూజర్లు.. మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018-19లో పోర్ట్-అవుట్స్‌ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్‌-ఇన్స్ (బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్‌ దాకా 2.04

డీహెచ్‌ఎఫ్‌ఎల్ బాకీల సత్వర పరిష్కారంపై ఎస్‌బీఐ ఆశలు

Friday 22nd November 2019

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద చర్యలు ఎదుర్కోబోతున్న డీహెచ్ఎఫ్ఎల్ కేసు.. నిర్దిష్ట గడువులోగా పరిష్కారం కాగలదని బ్యాంకులు ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. "ఇది ఇప్పుడే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కు చేరింది. ఎన్‌సీఎల్‌టీ అమలు చేసే ప్రక్రియే దీనికీ వర్తిస్తుంది. సాధారణ౾గా పొడిగింపును కూడా పరిగణనలోకి తీసుకుంటే 330 రోజుల గడువు ఉంటుంది. లేకపోతే 180

Most from this category