News


యాక్సిస్‌ బ్యాంకులో భారీగా రాజీనామాలు..!

Wednesday 8th January 2020
news_main1578475962.png-30767

నెలల వ్యవధిలో 15వేల మంది రాజీనామా

గడచిన కొన్ని నెలల్లో యాక్సిస్‌ బ్యాంక్‌లో దాదాపు 15వేల మంది రాజీనామా చేశారు. ముఖ్యంగా వినియోగదారులకు ప్రత్యక్షంగా సేవలను అందించే శాఖల నుంచే ఎక్కువగా రాజీనామాలు జరిగినట్లు తెలుస్తుంది. అలాగే కొందరు సీనియర్‌ స్థాయి అధికారులు కూడా తన పదవుల నుంచి వైదొలిగారు. అటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అత్యధునిక సాంకేతికను అందిపుచ్చుకునే దిశగా బ్యాంకు అడుగులు వేస్తోంది. ఈ అంశం పాత ఉద్యోగులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. బ్యాంకులో ఏర్పడిన భారీ ఖాళీల కారణంగా నూతన యాజమాన్యం నిర్దేశించిన వృద్ధి లక్ష్యాను అందుకునే క్రమంలో మధ్య, బ్రాంచ్‌స్థాయి తీవ్ర ఒత్తిడికి ఎదుర్కోంటున్నారు. రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. కొత్త నియామాకాల్లో బ్యాంకర్ల కంటే ఇంజనీర్ల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని ఈ అంశంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు తెలిపారు.

భారీ స్థాయిలో నెలకొన్న ఉద్యోగుల కొరత కారణంగా వృద్ధి కొనసాగింపు ప్రశ్నార్థకం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే సాధ్యమైనంత తర్వలో నియామకాలను చేపడతాయాని బ్యాంకు ఉన్నాధికారులు చెప్పుకొచ్చారు. ‘‘బ్యాంకు సీఈవోగా రెండో ధఫా శిఖాశర్మ నియామకాని ఆర్‌బీఐ అనుమతిని ఇవ్వకపోవడంతో అమితాబ్‌ చౌదరి బ్యాంకు పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంకు సంపూర్ణ పనితీరు మార్పుతో చాలా మంది ఉద్యోగులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాత సంస్కృతికి అలవాటు పడిన ఉద్యోగులు కొంత అసౌకర్యంగా అనుభవిస్తున్నారు.’’ అని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

గత కొన్ని నెలల్లో రికార్డు స్థాయిలో రాజీనామాలు జరిగినట్లు యాక్సిస్ బ్యాంక్ అంగీకరించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 28,000 మందిని నియమించుకున్నామని బ్యాంకు తెలిపింది. రానున్న రెండేళ్లలో కొత్తగా 30వేల కొత్త ఉద్యోగ నియామకాలను జరుపుతామని పేర్కోంది. ప్రతి ఆర్థిక ఏడాదిలో బ్యాంకు నికర కొత్త నియామకాలు 12,800లుగా ఉన్నాయి. బ్యాంకులో ప్రస్తుతం 72,000 మంది ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు వేగంగా విస్తరిస్తుంది. గతేడాదిలో పోలిస్తే ఈ ఏడాదిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఇప్పుడు మా దృష్టి అంతా ‘‘వృద్ధి, లాభదాయకత, స్థిరత్వం’’అంశాలపై ఉంది. ఈ దిశగా ముందుగా రచించిన ప్రణాళికలు అమలు చేస్తున్నామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ దాహియా తెలిపారు. You may be interested

సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Wednesday 8th January 2020

కాకతీయ 20 శాతం హైజంప్‌ ఓరియంట్‌ సిమెంట్‌ 7 శాతం ప్లస్‌ గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 లక్షల కోట్లతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి బూస్ట్‌ నివ్వనున్న ప్రణాళికలు ప్రకటించాక ఇటీవల జోరం‍దుకున్న సిమెంట్‌ రంగ కౌంటర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సాధారణ బడ్జెట్‌లో గృహ, నిర్మాణ రంగాలకు మేలు చేయగల ప్రతిపాదనలుండవచ్చన్న అంచనాలు సిమెంట్‌ రంగానికి జోష్‌నిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు

కరెక‌్షన్‌లో కొనుగోళ్లకు అవకాశాలు!

Wednesday 8th January 2020

నిపుణుల సూచన యూఎస్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా యూఎస్‌కు చెందిన మిలటరీ బేస్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేసింది. దీంతో యూఎస్‌ ఫ్యూచర్లు ఒక్కమారుగా భారీ నష్టాల్లోకి మరలాయి. కానీ వెనువెంటనే ఆల్‌ ఈజ్‌ వెల్‌ అంటూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో ఉపశమనం పొందాయి. దేశీయ సూచీలు సైతం ఆరంభంలో భారీ నష్టం చూపి క్రమంగా కొంత కోలుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా నుంచి భారీ ప్రతిస్పందన

Most from this category