News


ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

Monday 9th September 2019
news_main1568004981.png-28263

  • విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే...
  • ఆర్థిఖ శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ భారత్‌ ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకుల్లో ఆరు బ్యాంకులను విలీనం చేయడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 2017లో ఉన్న 27 నుంచి ప్రస్తుతం 12కు పరిమితం తగ్గనున్నాయి. దీంతో ప్రపంచస్థాయిలో ఆరు మెగా బ్యాంకులు ఆవిర్భవించనున్నాయి. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారంలో భాగంగానే బ్యాంకుల విలీన నిర్ణయం తీసుకున్నారని కుమార్‌ చెప్పారు. ‘ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించాలంటే భారీ స్థాయి బ్యాంకులు అవసరం. తాజా మెగా విలీన నిర్ణయం ఈ దిశగా అడుగులు వేయడం కోసమే. భారీ మూలధన నిధులతో మనకు ఇప్పుడు ఆరు మెగా బ్యాంకులు ఉంటాయి. పటిష్ట బ్యాంకులతో అంతర్జాతీయంగా పోటీపడేందుకు వీలవుతుంది’ అని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.



You may be interested

చిదంబరం పాత్రపై దర్యాప్తు చేయాలి: జిగ్నేష్‌షా

Monday 9th September 2019

న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ కోలొకేషన్‌ కేసును సూపర్‌ వైట్‌ కాలర్‌ నేరంగా వ్యాపార వేత్త జిగ్నేష్‌షా అభివర్ణించారు. అక్రమంగా బిలియన్‌ డాలర్లు ఈ మార్గంలో ఆర్జించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో కేవలం కొందరు బ్రోకర్లకు ట్రేడింగ్‌లో ప్రాధాన్యం ఇస్తూ వసతులు కల్పించిన ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇతరుల పాత్రపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిగ్నేష్‌ షా ఎంసీఎక్స్‌ సహా ఎన్నో ఎక్సేంజ్‌లకు ఆద్యుడన్న

సెన్సెక్స్‌ 37,190 స్థాయిని అధిగమిస్తే...

Monday 9th September 2019

ఎఫ్‌పీఐలపై బడ్జెట్లో పెంచిన ఆదాయపు పన్ను సర్‌ఛార్జ్‌ ఉపసంహరణ, ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు మూలధన కల్పన, ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల లభ్యత వంటి సానుకూల ‍ప్రకటనలు కేంద్రం నుంచి వెలువడినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో భారత్‌ మార్కెట్‌...అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా గతవారం నష్టాలతో ముగిసింది. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు పునర్‌ప్రారంభంకానున్నట్లు వెలువడిన వార్తలు, వచ్చే ఫెడ్‌ మీటింగ్‌లో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లన్నీ

Most from this category