News


బడ్జెట్‌ గురించి పది విశేషాలు

Thursday 4th July 2019
news_main1562263096.png-26805

మన దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే బడ్జెట్‌కు విశేష ప్రాధాన్యం ఉంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అన్ని వర్గాల జీవితాలను బడ్జెట్‌లోని కేటాయింపులు, నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. అందుకే బడ్జెట్‌ను ఎక్కువ మంది ఆసక్తిగా పరిశీలిస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి బడ్జెట్‌ను, కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు తొలి బడ్జెట్‌ అవుతుంది. ఈ సందర్భంగా బడ్జెట్‌ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవి.. 

 

  • స్వతంత్ర భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1947లో ఆర్‌కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. 
  • బ్రిటిష్‌ రాజ్‌ (బ్రిటిషర్ల పాలనలో) భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ 7న అప్పటి ఆర్థిక మంత్రి జేమ్స్‌ విల్‌సన్‌ తీసుకొచ్చారు. 
  • ఎక్కువ బడ్జెట్లను ప్రవేశపెట్టిన ఘనత మోరార్జీదేశాయ్‌కే సొంతం. పది పూర్తి స్థాయి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆయన 1959-1964 మధ్య ప్రవేశపెట్టారు. 
  • ఆ తర్వాత పి.చిదంబరం అత్యధికంగా తొమ్మిది బడ్జెట్లను తీసుకొచ్చారు. ప్రణబ్‌ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్లను, యశ్వంత్‌ సిన్హా, యశ్వంత్‌రావు చవాన్‌, సీడీ దేశ్‌ముఖ్‌ ఒక్కొకరు ఏడు బడ్జెట్ల చొప్పున, మన్మోహన్‌ సింగ్‌, టీటీ కృష్ణమాచారి ఆరు బడ్జెట్ల చొప్పున ప్రవేశపెట్టారు. 
  • యూనియన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి రికార్డు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ఉంది. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, స్వతంత్ర, పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ప్రవేశపెడుతున్నది మాత్రం నిర్మలా సీతారామన్‌ అవుతారు. 
  • గతంలో బడ్జెట్‌ అన్నది మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టేవారు. మొదటి సారి ఎన్డీయే ప్రభుత్వంలో యశ్వంత్‌ సిన్హా ఈ విధానాన్ని మార్చి, ఫిబ్రవరిలో ఆఖరి రోజున ఉదయం 11 గంటలకు తీసుకొచ్చారు. 
  • రైల్వే బడ్జెట్‌ను విడిగా 92 సంవత్సరాల పాటు తీసుకొచ్చారు. 2017 నుంచి మోదీ సర్కారు దీన్ని సార్వత్రిక బడ్జెట్‌లో కలిపేసింది. 
  • చాలా కాలం పాటు బడ్జెట్‌ ప్రతులను రాస్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. ఆ తర్వాత 1980 నుంచి ఢిల్లీలోని మింట్‌రోడ్డుకు మార్చారు. ఆర్థిక శాఖ కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌కు ఇది మారింది.
  • బడ్జెట్‌ సమర్పించడానికి ముందు అప్పటి వరకు బడ్జెట్‌ ముద్రణలో పాలు పంచుకున్న ఉద్యోగులకు హల్వా పంచే కార్యక్రమం జరుగుతుంది.  
  • చిదంబరం ప్రవేశపెట్టిన 1997-98 బడ్జెట్‌ను డ్రీమ్‌ బడ్జెట్‌గా చెబుతారు. వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్నును తగ్గించడంతోపాటు, భారీ సంస్కరణలకు నాటి బడ్జెట్‌ అద్దం పట్టింది. 1973-74 బడ్జెట్‌ను బ్లాక్‌ బడ్జెట్‌గా చెబుతారు. నాడు రూ.550 కోట్ల లోటు బడ్జెట్‌ అది. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 5th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు వెలువడనున్న శుక్రవారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.35 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 17 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,997 పాయింట్ల వద్ద కదులుతోంది. గురువారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,980 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు ఉదయం 11 గంటలకు

భిన్న మార్గాల్లో బ్లూచిప్‌, స్మాల్‌క్యాప్స్‌ 

Thursday 4th July 2019

స్మాల్‌ క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే బ్లూచిప్‌ షేర్లు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. ఏడాదికి పైగా ఇదే దృశ్యం ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ముందు కదలాడుతోంది. ఆర్థిక రంగ మందగమనంలో ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో దశాబ్ద కాలంలోనే బ్లూచిప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల మధ్య అంతరం గరిష్ట స్థాయికి చేరింది.    కేంద్రంలో పూర్వపు ప్రభుత్వానికే ఓటర్లు భారీ మెజారిటీతో పట్టం కట్టడంతో ఈక్విటీ మార్కెట్ల

Most from this category