News


ఈ-కామర్స్‌ లావాదేవీలపై 1% టీడీఎస్‌

Sunday 2nd February 2020
Markets_main1580620404.png-31433

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్‌ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ ఉన్న పక్షంలో ఈ నిబంధన వర్తించదు. దీన్ని అధ్యయనం చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించగా .. ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్ స్పందించలేదు. 



You may be interested

బడ్జెట్‌ 2020: కార్పోరేట్ల కామెంట్స్‌

Sunday 2nd February 2020

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన కార్పోరేట్‌ కంపెనీ దిగ్గజాలు స్పందిచారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో నిర్మలమ్మ జీడీపీ వృద్ధి పైనే దృష్టి సారించారు. తన బడ్జెట్ స్పీచ్‌లో దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి అగ్రతాంబూలం వేశారు. పారిశ్రామిక, మార్కెట్ వర్గాల ఆశలు మాత్రం నెరవేరలేదు. గ్రామీణ భారతానికి, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఈ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే... ‘భారత కార్పొరేట్‌ రంగాన్ని వెంటాడుతోన్న పన్ను వేధింపులకు

బడ్జెట్‌కు ముందు మంత్రిగారి పూజ

Sunday 2nd February 2020

బడ్జెట్‌ సమర్పించడానికి కొన్ని గంటల ముందు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం తన నివాస గృహంలో పూజలు చేశారు. నేలపై దుప్పటి పరుచుకుని దైవ విగ్రహం ఎదుట స్వయంగా ఆయనే పూజలో కూర్చున్నారు. ‘ప్రజలందరికీ మంచి జరిగేలా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం శ్రమించింది. అందరికీ మంచి జరగాలని దైవాన్ని కూడా ప్రార్థించాను. ‘అందరితో కలిసి, అందరి అభివృద్ధికి’ అనే మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా బడ్జెట్‌

Most from this category