News


పెట్టుబడులు డిస్కౌంట్ల కోసం కాదు: అమెజాన్‌

Tuesday 4th February 2020
news_main1580802891.png-31501

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చావు కబురును చల్లగా మెప్పింది. ఇటీవల భారత్‌లో పర్యటన సందర్భంగా సంస్థ సీవోఈ జెఫ్ బెజోస్ ప్రకటించిన రూ.7,100 కోట్లను పెట్టబడులను ధీర్ఘకాలిక అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని, డిస్కౌంట్ల లేదా నష్టాలను పూడ్చుకునేందుకు కాదని అమెజాన్‌ ఇండియా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 50 ప్రపంచ స్థాయిలో మల్టీ-మిలియన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను నిర్మాణం చేపట్టాల్సి అవసరం ఉందని అమెజాన్‌ ఇండియా విక్రయ సేవల విభాగపు అధిపతి గోపాల్‌ పిళ్లై తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 15 రాష్ట్రాల్లో 8లక్షల మంది శిల్పకారుల, చేనేత కార్మికులకు... స్వయం ఉపాధి మహిళల సంఘంతో జతకట్టి 2.8లక్షల మంది మహిళలకు ప్రత్యక్ష ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. భారీ పెట్టుబడులను స్వల్పకాలిక అవసరాలకు వినియోగిస్తే ఈ లక్ష్యాలను సాధించలేమని ఆయన తెలిపారు. కాబట్టి పెట్టుబడులను 5-10 ఏళ్ల ధీర్ఘకాలికాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నట్లు పిళ్లై తెలిపారు.

అమెజాన్‌ ప్రకటించే భారీ డిస్కౌంట్ల కారణంగానే భారీ నష్టాలను చవిచూడటం ఆశ్చర్యపరిచిందని గోయల్ తెలిపారు. కంపెనీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు, కానీ ప్రతి ఏడు ఒక బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగి ఉంటే, అప్పుడు వారు ఆ బిలియన్ డాలర్లను నష్టాన్ని పూడ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే భారతదేశానికి గొప్ప సహాయం చేస్తున్నట్లు కాదని పెళ్లై అభిప్రాయపడ్డారు. 

భారీ డిస్కౌంట్ల కోణంలో చూస్తే వస్తువు ధరపై ఎంత డిస్కౌంట్‌ను ఇవ్వాలో అనే విక్రయదారు అభీష్టం మేరకే ఉంటుందని అందులో అమెజాన్ ఎలాంటి పాత్ర పోషించదని పిళ్ళై చెప్పారు. ఆఫ్‌లైన్‌ కంటే మా మార్కెట్‌ ప్లేస్‌లో తక్కువ ధరకు లభిస్తుందంటే అది కేవలం ఈ విక్రయదారుని సలహామేరకు ఉంటుంది. బిలియన్ డాలర్ల పెట్టుబడికి డిస్కౌంట్‌తో సంబంధం లేదు. ఇప్పటికి వరకు విజయవంతమైన ప్రాజెక్ట్‌లను రెట్టింపు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశాము  మరిన్ని చోట్ల సంచార డిజిటల్‌ మార్కెట్లను ప్రారంభించడంతో పాటు సంఖ్యను పెంచడం ద్వారా 2025 నాటికి ఎగుమతులకు 10 బిలియన్ డాలర్లకు చేరుకోవడంలో సహాయపడుతుందని పిళ్లై అభిప్రాయడ్డారు. 



You may be interested

ఈ 16 షేర్లకూ బడ్జెట్‌.. భారం?!

Tuesday 4th February 2020

రంగాల వారీ జాబితా ఇలా.. పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు ఎరువులు, బీమా, రియల్టీ బడ్జెట్‌లో తాజా ప్రతిపాదనల కారణంగా 16 స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావాలు పడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు కొన్ని భావిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులు, రైల్వేలు, ఎరువులు, బీమా, రియల్‌ ఎస్టేట్‌ తదితర రంగాలు, కంపెనీలు ఈ జాబితాలో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా వినియోగాన్ని పెంచే చర్యల ద్వారా ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే అంశాలలో బడ్జెట్‌ నిరాశపరచినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

శ్రీరామ్‌ ట్రాన్స్‌ దౌడు- జీఎస్‌కే ఫార్మా ‘బేర్‌

Tuesday 4th February 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ శ్రీరామ్‌ ట్రాన్స్‌ 10 శాతం అప్‌ జీఎస్‌కే ఫార్మా 10 శాతం డౌన్‌ కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశ నేపథ్యంలో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు రెండు రోజుల్లోనే బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దూకుడు చూపుతున్నాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 753 పాయింట్లు జంప్‌చేసి 40,625ను తాకగా.. నిఫ్టీ 229 పాయింట్లు పురోగమించి 11,937 వద్ద ట్రేడవుతోంది. వెరసి మార్కెట్లు శనివారం నమోదైన నష్టాలను దాదాపు

Most from this category