News


అంచనాల్ని అందుకోని కోటక్‌ బ్యాంక్‌ ఫలితాలు

Monday 20th January 2020
Markets_main1579516692.png-31053

ముంబై: ప్రైవేటు రంగ రుణదాత కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ స్టాండెలోన్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 23.62 శాతం పెరిగి రూ.1,596 కోట్లుగా నమోదైంది. కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు  సోమవారం ముంబైలో జరిగిన సమావేశంలో కన్సాలిడేటెడ్‌,స్టాండెలోన్‌ ఫలితాలను ఆమోదించారు.  ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసిక స్టాండెలోన్‌ నికర లాభం 2019 క్యూ3తో పోలిస్తే 24 శాతం పెరిగి రూ.1,291 కోట్ల నుంచి రూ. 1,596 కోట్లకు చేరింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 1,710.5 కోట్లు నికర లాభం రావాల్సి ఉండగా రూ.1,596 కోట్లతో మార్కెట్‌ అంచనాలు అందుకోలేకపోయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మూడోత్రైమాసిక  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 2019 మూడోత్రైమాసిక ఫలితంలో పోలిస్తే 27 శాతం పెరిగి రూ.1.844 కోట్ల నుంచి రూ.2,349 కోట్లకు చేరింది. త్రైమాసిక  నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి రూ.2,926 కోట్ల నుంచి రూ.3,439 కోట్లకు చేరింది. అదేవిధంగా నికర వడ్డీ మార్జిన్‌  4.31 శాతం నుంచి పెరిగి 4.69 శాతంగా నమోదైంది. బ్యాంకు స్థూల మొండి బకాయిలు క్యూ2తో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.46 శాతానికి పెరిగాయి. గతేడాది డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది 2.07 శాతంగా వుంది. నికర ఎన్‌పీఏలు సైతం 0.85 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. ఫలితాల ప్రభావంతో సోమవారం కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేరు 4.5 శాతంపైగా క్షీణించి రూ. 1617 వద్ద ముగిసింది. 



You may be interested

ఫండ్స్‌కు ఇవి వ్యాల్యూ బెట్స్‌!

Monday 20th January 2020

డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో గణాంకాలను పరిశీలిస్తే.. ఫండ్‌ మేనేజర్లు బాగా దిద్దుబాటుకు గురైన 15 స్టాక్స్‌లో వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు అర్థమవుతోంది. వీటిల్లో కొన్ని గరిష్ట ధరల నుంచి 50 శాతం వరకు పడిపోయినవి. త్రైమాసికం వారీగా చూసుకుంటే ఈ స్టాక్స్‌లో చాలా వరకు ఫండ్స్‌ కనీసం ఒక శాతానికి పైనే వాటాలు పెంచుకున్నాయి.   బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ స్టాక్‌ ఫండ్స్‌ను ఎక్కువగా ఆకర్షించింది. గతేడాది

రికార్డుస్థాయి నుంచి పతనం..!

Monday 20th January 2020

సెన్సెక్స్‌ 416 పాయింట్లు డౌన్‌ 128 పాయిం‍ట్లు కోల్పోయిన నిఫ్టీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమైనప్పటికీ వెనువెంటనే అమ్మకాలు ఊపందుకోవడంతో చివరికి పతనంతో నిలిచాయి. సెన్సెక్స్‌ 416 పాయింట్లు కోల్పోయి 41,529 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 128 పాయింట్లు క్షీణించి 12,224 వద్ద స్థిరపడింది. అయితే తొలుత కొనుగోళ్ల మద్దతు లభించడంతో 42,274 వద్ద సెన్సెక్స్‌, 12,430 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. తదుపరి సమయం గడిచేకొద్దీ అమ్మకాలు

Most from this category