News


జెన్సార్‌-అదానీ గ్యాస్‌- పీఎన్‌బీ హౌసింగ్‌ ‘బేర్‌

Friday 24th January 2020
Markets_main1579842748.png-31158

ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరింత బలపడ్డాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లు పెరిగి 41,487కు చేరగా.. నిఫ్టీ 34 పాయింట్లు పుంజుకుని 12,215 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఐటీ సేవల కంపెనీ జెన్సార్‌ టెక్నాలజీస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోపక్క నిబంధనలు ఉల్లంఘించిందంటూ పెట్రోలియం, గ్యాస్‌ నియంత్రణ సంస్థ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడికావడంతో అదానీ గ్యాస్‌ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. వెరసి ఈ మూడు కౌంటర్లూ భారీ నష్టాలతో బేర్‌మంటున్నాయి. వివరాలు చూద్దాం...

జెన్సార్‌ టెక్నాలజీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జెన్సార్‌ టెక్నాలజీస్‌ నికర లాభం సగానికిపైగా క్షీణించి రూ. 39.5 కోట్లకు పరిమితమైంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం​5 శాతం తక్కువగా రూ. 1021 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 54 శాతం వెనకడుగుతో రూ. 70 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 2.5 శాతం నీరసించి 11.5 శాతానికి చేరాయి. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జెన్సార్‌ టెక్నాలజీస్‌ షేరు 12.2 శాతం పడిపోయింది. రూ. 175 దిగువన ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 172 దిగువకు క్షీణించింది.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 566 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం యథాతథంగా రూ. 2075 కోట్లుగా నమోదైంది. పన్ను వ్యయాలు రూ. 139 కోట్ల నుంచి రూ. 61 కోట్లకు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ హౌసింగ్‌ షేరు 10.2 శాతం కుప్పకూలింది. రూ. 485 దిగువన ‍ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 476 వద్ద కనిష్టానికి చేరింది. 

అదానీ గ్యాస్‌ 
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో ఒప్పందానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని వెల్లడించలేదంటూ అదానీ గ్యాస్‌ కంపెనీకి పెట్రోలియం, సహజవాయు నియంత్రణ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) నోటీసు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నెట్‌వర్త్‌ ఆధారంగా గ్యాస్‌ ప్రాజెక్టులకు అదానీ గ్యాస్‌ బిడ్డింగ్‌ వేసినట్లు తెలుస్తోంది. సిటీ గ్యాస్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ షేర్‌ హోల్డింగ్‌లో మార్పులు చేపట్టినట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పీఎన్‌జీఆర్‌బీ.. అదానీ గ్యాస్‌ లైసెన్స్‌లను రద్దు చేయడంతోపాటు.. రూ. 400 కోట్లమేర జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అదానీ గ్యాస్‌ షేరు 5.3 శాతం పతనమై రూ. 164 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 16 శాతం పడిపోయింది. రూ. 149 దిగువకు చేరింది.You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 24th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్లు ఇండియా బుల్స్‌ వెంచర్స్‌: ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం తగ్గి రూ.120.4 కోట్ల నుంచి రూ104 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన ఆదాయం 53 శాతం పెరిగి రూ.566 కోట్ల నుంచి రూ.867 కోట్లకు చేరింది. జెన్సర్‌ టెక్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 50.6 శాతం తగ్గి రూ.80 కోట్ల నుంచి రూ.40 కోట్లకు చేరింది.

వొడాఫోన్‌ ఐడియా మూసివేత ఖాయమా?

Friday 24th January 2020

కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఉపశమనాలు ప్రకటించినా వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌)ను గట్టెక్కించలేవని, ఏ విధమైన ఫైనాన్షియల్‌ బెయిల్‌అవుట్స్‌ కూడా వీఐఎల్‌ను తిరిగి జియో, ఎయిర్‌టెల్‌తో పోటీలో నిలపలేవని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా వీఐఎల్‌ను బయటపడేయడం చాలా ఖరీదైన వ్యవహారంగా గుర్తిస్తుందని డాయిష్‌బ్యాంక్‌ ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో వీఐఎల్‌ను దివాలా తీయించి అనంతరం ఆస్తుల వేలం సమయంలో తిరిగి కొనుగోలు చేయవచ్చని ఆదిత్య బిర్లాగ్రూప్‌ భావించవచ్చని తెలిపింది. అయితే

Most from this category