News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 6 శాతం క్రాష్‌

Tuesday 6th August 2019
Markets_main1565074258.png-27574

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని 11 శాతం వాటాను ప్రమోటర్లు  ఇన్వెస్కో ఒపెన్‌హీమర్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించిన తర్వాత నుంచి జీ షేరు విలువ వరుస సెషన్‌లలో నష్టాల్లో ట్రేడవుతోంది. జీ షేరు మంగళవారం(అగష్టు 6) మధ్యాహ్నం 12.04 సమయానికి 6.69 శాతం నష్టపోయి రూ. 308.80 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో ఈ కంపెనీ షేరు రూ. 330.95 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఎస్సెల్‌ గ్రూప్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి రూ. 11,000 కోట్ల చెల్లింపులను చేయవలసి ఉండడంతో జీ కంపెనీ కూడా ఒత్తిడిలో ఉందని ఎండీ, సీఈఓ పునిత్‌ గొయంక్‌ తెలిపారు.      



You may be interested

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Tuesday 6th August 2019

గతకొద్ది రోజులుగా భారీగా నష్టపోయిన మెటల్‌ షేర్లకు మంగళవారం ట్రేడింగ్‌లో కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా నేడు లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లు సైతం మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,385.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 2466.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.

హెచ్‌ఎస్‌బీసీ సీఈవోకు ఉద్వాసన

Tuesday 6th August 2019

లండన్‌: హెచ్‌ఎస్‌బీసీ సీఈవో జాన్‌ ఫ్లింట్‌ అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ప్రపంచంలో ఏడో అతిపెద్ద బ్యాంకు, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. సొంత దేశంతోపాటు ఆసియాలో ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో నూతన నాయకత్వం అవసరమని హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ పేర్కొంది. పరస్పర అంగీకారం మేరకు ఫ్లింట్‌ వైదొలిగారని, గ్లోబల్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నోయెల్‌ క్విన్‌ తాత్కాలిక సీఈవోగా

Most from this category