News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5 శాతం జంప్‌

Tuesday 28th May 2019
Markets_main1559028312.png-25956

క్యూ4లో ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం మేర పెరిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 17.8 శాతం పెరుగుదలతో రూ. 7,933 కోట్లకు చేరగా, నికరలాభం 26.8 శాతం పెరిగి రూ. 292 కోట్లకు చేరినట్లు జీ తెలిపింది. దీంతో మధ్యాహ్నం 1 గంట సమయానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 5 శాతం పెరిగి రూ. 378 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ప్రారంభానికంటే ముందుగానే ఫలితాలు వెల్లడైనప్పటికీ, ఇటీవల ఈ ఎస్సాల్‌ గ్రూప్‌ కంపెనీ పట్ల పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ఉదయం ఈ షేరు రూ.352 వద్ద స్థిరంగా ట్రేడింగ్‌ ప్రారంభించింది. క్రమేపీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పూనుకోవడంతో నెమ్మదిగా ర్యాలీ జరిపింది. మధ్యాహ్న సమయానికి ఎన్‌ఎస్‌ఈలో జీ కౌంటర్లో 2.5 కోట్లకుపైగా షేర్లు చేతులు మారాయి. 



You may be interested

ఆర్ధిక స్థితి ఆందోళనకరం

Tuesday 28th May 2019

 రేటింగ్ సంస్థల విశ్లేషణ తక్షణ చర్యలకై విజ్ఞప్తి మే 31 జీడీపీ గణాంకాల విడుదల రానున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ నేపథ్యం భారత ఆర్థిక పరిస్థితిపై పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం చర్యలకు సూచిస్తున్నాయి. మే 31 వ తేదీన 2018-19 (ఏప్రిల్‌-మార్చి) ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విడుదల కానుండడం దీనికి నేపథ్యం. వచ్చే ఒకటి, రెండు నెలల్లో  కేంద్రం 2019-2020

గెయిల్‌ చరిత్రాత్మక లాభం

Tuesday 28th May 2019

ఒక షేరుకు మరో షేరు బోనస్‌ రూ.1.75 చొప్పున తుది డివిడెండ్‌ విస్తరణపై రూ.54,000 కోట్ల వ్యయ ప్రణాళిక న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌ మార్చి త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఆదాయం సైతం రూ.15,430 కోట్ల నుంచి రూ.18,764కోట్లకు వృద్ధి చెందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.74,808 కోట్ల ఆదాయం (39 శాతం అధికం)పై

Most from this category