ఛైర్మన్ రాజీనామా.... ‘జీ’ 5 శాతం డౌన్
By Sakshi

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం సెషన్లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 12.27 సమయానికి జీ 5.70 శాతం నష్టపోయి రూ. 324.20 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 343.80 వద్ద ముగసిన ఈ షేరు, మంగళవారం సెషన్లో రూ. 341.00 వద్ద ప్రారంభమైంది. కాగా రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పడిపోవడం గమనార్హం.
అసలెందుకీ రాజీనామా?
కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ (జీఈఈఎల్ మాతృసంస్థ) తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల చెల్లింపుల కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు నవంబర్ 20న ఎస్సెల్ గ్రూప్ ప్రకటించింది.
You may be interested
మీ డిమ్యాట్ సురక్షితమేనా?!
Tuesday 26th November 2019బ్రోకింగ్ సంస్థ నుంచి మీ హోల్డింగ్స్ కాపాడుకోండి నిపుణుల సూచనలు కార్వీసంస్థ నిర్వాకం బయటపడడంతో ఇన్వెస్టర్లంతా అవాక్కయ్యారు. కార్వీ అవకతవకలపై సెబి కన్నెర్రజేసింది. క్లయింట్లకు తెలియకుండా వాళ్ల అకౌంట్లను వాడుకోవడాన్ని సెబి తీవ్రంగా పరిగణించింది. కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా ఆదేశాలిచ్చింది. కార్వీ దెబ్బకు ఇన్వెస్టర్లు తమ తమ అకౌంట్లను బ్రోకింగ్ సంస్థలు ఎలా అనైతికంగా వాడుకుంటున్నాయో తెలిసివచ్చింది. ఈనేపథ్యంలో మీ డీమాట్ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. = టెక్నాలజీని వాడుకోండి:
టెలికాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి
Tuesday 26th November 2019టెలికం రంగ షేర్లు మంగళవారం ఉదయం సెషన్లో నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ రద్దు కావడంతో ఆయా కంపెనీలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్ఈలో టెలికం రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ టెలికాం ఇండెక్స్ 4శాతం మేర నష్టపోయింది. ఈ రంగానికి చెందిన భారతీ ఇన్ఫ్రాటెల్ 7శాతం, భారతీ ఎయిర్టెల్ 5శాతం, ఆప్టిమస్