News


ఐదేళ్ల కనిష్ఠానికి ‘జీ’

Friday 20th September 2019
Markets_main1568960973.png-28453

సుభాష్‌ చంద్ర నాయకత్వంలోని ఎస్సెల్‌ గ్రూప్‌కు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి బీఎస్‌ఈలో ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. రుణాన్ని తిరిగి చెల్లించడానికి సుభాష్‌ చంద్ర ప్రైవేట్ సంస్థలకు మరికొంత సమయం ఇవ్వాలా వద్దా అనే అంశంపై మ్యూచువల్ ఫండ్స్ తమలో తాము గొడవ పడుతుండటంతో ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ల రుణ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఫలితంగా శుక్రవారం ఉదయం 10.57 సమయానికి 9.65 శాతం నష్టపోయి రూ. 279.05 వద్ద ఈ షేరు ట్రేడవుతోంది. 
  మ్యూచువల్ ఫండ్స్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రుణాలను తిరిగి చెల్లించి, తనఖాలో ఉన్న ఎస్సెల్‌ ప్రమోటర్ల షేర్లను విడిపించడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇంకో 11 రోజులు సమయం​మాత్రమే ఉంది. దీంతో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ జీ ప్రమోటర్లకు ఇంకో మూడు నెలల సమయం ఇవ్వడానికి సిద్ధమవుతుండగా, మరి కొంత మంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. కాగా ఎస్సెల్‌ గ్రూప్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని తమ షేర్లను ప్రమోటర్లు తనఖా పెట్టి రుణాలను సేకరించిన విషయం తెలిసిందే. రుణాలను గడువులోపు తిరిగి చెల్లించలేమని, మరికొంత సమయం కావాలని ఎస్సెల్‌ గ్రూప్‌, మ్యూచువల్‌ ఫండ్లను కొరిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఎస్సెల్ గ్రూప్ సంస్థ డిష్ టీవీ షేరు బీఎస్‌ఈలో ఉదయం 10.57 సమయానికి 7.11 శాతం నష్టపోయి రూ .18.30 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

భారీ లాభాల్లో మారుతి, బజాజ్‌, ఐషర్‌

Friday 20th September 2019

కేంద్రప్రభుత్వం అనుహ్యాంగా దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో మార్కెట్‌లు శుక్రవారం ర్యాలీ చేస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నాం 12.30 సమయానికి 7.48 శాతం లేదా 517.60 పాయింట్లు లాభపడి 7,438.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 8.84 శాతం లేదా రూ. 528.05 లాభపడి రూ. 6,499.80     వద్ద, బజాజ్‌ ఆటో 6.50 శాతం లేదా రూ.

బ్యాంక్‌ నిఫ్టీ 6.50శాతం ర్యాలీ

Friday 20th September 2019

కేంద్రం దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ చరిత్రలో ఒకరోజులో అతిపెద్ద లాభాల్ని చవిచూసింది. నేడు ఇండెక్స్‌ 26,878.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  దేశీయ కంపెనీలపై ప్రసుత్తం 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో అన్నిరంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రైవేట్‌రంగ బ్యాంక్‌లకు కలిసొస్తుందనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల

Most from this category