News


పెరిగిన చెల్లింపుల కాలవ్యవధి..జీ షేరు 6% అప్‌

Thursday 3rd October 2019
Markets_main1570089711.png-28698

రుణ చెల్లింపుల కాల వ్యవధిని రుణదాతలు ఇంకో ఆరు నెలలు పొడిగించారని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 9 శాతం లాభపడింది. ‘జీ లోని కొంత వాటాను విక్రయించేందుకు, జీ, రుణ దాతలు ఒక పరిష్కార మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు అదనంగా 10 శాతం వాటాను విక్రయించేందుకు ప్రతిపాదనలు జరిగాయి’ అని జీ ఎంటర్‌టైన్‌ సీఈఓ పునిత్‌ గొయెంక్‌ అక్టోబర్‌ 1న ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. కాగా దేశీయ రుణ దాతలకు రూ. 5,000 కోట్ల రుణ చెల్లింపులను చేయవలసి ఉందని గొయెంక్‌ అన్నారు. రుణదాతలు రుణ చెల్లింపు సమయాన్ని ఆరు నెలలకు పెంచడానికి ఏకగ్రీవంగా అంగీకరించారని, ఇది తమ ఆస్తులను మంచి విలువ వద్ద విక్రయించేందుకు ఒక అవకాశమిస్తుందని సెప్టెంబర్‌ 25న ఎస్సెల్‌ గ్రూప్‌ ఒక ప్రకటనలో పేర్కొం‍ది. కాగా ఈ ప్రకటన విడుదలైన తర్వాత( సెప్టెంబర్‌ 26న ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ జీ రుణ చెల్లింపు కాలాన్ని పెంచడంపై సౌకర్యంగా లేదని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగీ అనడం గమనార్హం. 
   ఆదిత్య బిర్లా ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ), హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఏఎంసీ, ఇతర రుణదాతలు జీ రుణ చెల్లింపుల కాల వ్యవధిని పెంచడానికి అంగీకరించారు. ఈ కంపెనీ రుణ చెల్లింపుల్లో సమస్యలను ఎదుర్కోడంతో జీ షేరు గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ముగుస్తుండడం తెలిసిందే. మధ్యాహ్నం 1.24 సమయానికి జీ షేరు విలువ ఎన్‌ఎస్‌ఈలో 6.69 శాతం లాభపడి రూ. 248.75 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

ఆసియాలో ఇండియా, మలేషియా మార్కెట్లే ఖరిదైనవి!

Thursday 3rd October 2019

ఆసియా ఈక్విటీ మార్కెట్‌లలో ఇండియా, మలేషియా ఈక్విటీ మార్కెట్లు చాలా ఖరీదుగా ట్రేడవుతున్నాయని రెఫినిటివ్‌ ఓ నివేదికలో పేర్కొంది. యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ కొంత సరళతరం అవ్వడంతో పాటు, ప్రధాన కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంతో గత నెల కాలంలో చాలా వరకు ఇతర ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయని ఈ కంపెనీ తెలిపింది. దేశీయ మౌలిక రంగాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు సెప్టెంబర్‌ నెలలో కార్పోరేట్‌ ట్యాక్స్‌ను ప్రభుత్వం

బ్యాంక్‌ నిఫ్టీ 1.50శాతం డౌన్‌

Thursday 3rd October 2019

బ్యాంకు రంగ షేర్ల భారీ పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం(430 పాయింట్లు) నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 28,606.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయి 28,296.50 కనిష్టానికి పతమైంది. ఇండెక్స్‌లో అత్యదిక వెయిటేజీ కలిగిన ప్రైవేట్‌రంగ బ్యాంకు షేర్లైన కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌,

Most from this category