News


కోలుకున్న జీ ఎంటర్‌‍ప్రైజెస్‌

Monday 28th January 2019
Markets_main1548653129.png-23845

  • కలిసొచ్చిన షేర్ల తనఖా ఒప్పందం

కంపెనీ రుణదాతలతో షేర్ల తనఖా ఒప్పందం కుదుర్చుకోవడంతో జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ షేర్లు సోమవారం రికవరీ బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్లు 14శాతానికి పైగా పెరిగాయి.  జీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటింగ్‌ గ్రూప్‌ అయిన ఎస్సెల్‌ గ్రూప్‌ తీవ్రఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో శుక్రవారం ఆ గ్రూప్‌ షేర్లు భారీగా పతమైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో షేరు మరింత క్షీణించినప్పటికీ.., షేర్ల విక్రయించకుండా తమ వద్దే పెట్టుకోవడానికి దాదాపు 97 శాతం రుణదాతలు అంగీకరించారు. అలాగే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్ చంద్ర వాటా విక్రయానికి రుణదాతలు మూడునెలల గడువు నిచ్చారు.  ఈ సానుకూల వార్తల నేపథ్యంలో  జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ షేరు బీఎస్‌ఈలో 10శాతం లాభంతో రూ.351.25ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే మరింత బలపడి 14 శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.365.00 గరిష్టానికి చేరుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.319.35)తో పోలిస్తే 11శాతం లాభంతో రూ.355.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

కొనసాగుతున్న పసిడి ర్యాలీ

Monday 28th January 2019

కీలక వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ తటస్థ విధానాన్ని అవలంభివచ్చనే అంచానాలతో సోమవారం సైతం పసిడి ర్యాలీ కొనసాగుతుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు ర్యాలీ చేసి 1,303డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ పతనం, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు, ఫెడ్‌ వడ్డీరేట్ల యధాతథ అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో  22.60డాలర్లు ర్యాలీ చేసిన కీలక 1300డాలర్లపై

ఈ రెండు షేర్లూ కొనవచ్చు.

Monday 28th January 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.2,096 టార్గెట్‌ ధర: రూ.2,500 ఎందుకంటే: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణ వృద్ధి జోరుగా ఉండటం, ఇతర ఆదాయం మెరుగుపడటంతో నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.5,590 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.12,570 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ నిలకడగా

Most from this category