News


మా ఫలితాలు మార్కెట్‌ అంచనాల్ని మించుతాయ్‌: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎండీ పునిత్ గోయెంకా

Monday 7th October 2019
Markets_main1570444952.png-28757

ప్రమోటర్ల తనఖా షేర్ల విక్రయంతో గతకొంతకాలంగా తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోంటున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో మూడు నెలల్లో మార్కెట్‌ అంచనాలు తలకిందులు చేస్తూ మెరుగైన పనితీరును కనబరుస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునిత్ గోయెంకా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలో వ్యాపార అనిశ్చితిని అరికట్టడానికి రాబోయే మూడు నెలల్లో రుణాన్ని తిరిగి చెల్లించాలని జీ  ప్రమోటర్లు కోరుకుంటున్నారని  పునిత్ గోయెంకా అన్నారు. మీడియా సంస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 22శాతానికి సమానమైన వాటాను ఆయా కంపెనీల్లో తనఖా పెట్టినప్పటికీ.., దాని ప్రభావం కంపెనీ పెద్దగా ఉండబోదని గోయెంకా తెలిపారు.
కంపెనీలు అప్పులు- తీర్చేందుకు ప్రణాళికలు..
ఈ ఏడాది జనవరి నాటికి ఈక్విటీ షేర్లు, కొన్ని ఇతర సెక్యూరిటీలపై మొత్తం రుణం సుమారు రూ.13,500 కోట్లు ఉండేది. నేటి ఈ మొత్తం రూ.7000 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు సగానికి పైగా రుణాలు మా ద్వారా లేదా మార్కెట్ల ద్వారా చెల్లించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే... కంపెనీకి చెందిన 205 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఆస్తులను రూ.1,300 కోట్లకు విక్రయించాం. ఈ మొత్తం ఈ త్రైమాసికం చివరిలోగా కంపెనీ చేతికి వస్తుంది. మిగిలిన 480 మెగావాట్ల సోలార్‌ ఆస్తుల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తున్నాము. చర్చలు విజయవంతమయ్యే దిశగా సాగుతున్నాయి. వీటితో పాటు మా రహదారి అసెట్స్‌పై కొన్ని బిడ్డింగ్‌ డాక్యుమెంట్స్‌ ఉన్నాయి. వీటి విక్రయానికి కూడా చర్చలు జరుపుతున్నాయి. ఈ మొత్తం విక్రయాల విలువ రూ.7,000 కోట్ల వరకు ఉంటుంది. కంపెనీపై ఉండే మొత్తం రుణాన్ని తీర్చేందుకు 3నెలల కాలం పడుతుంది.
తనఖా షేర్లు- కంపెనీపై దాని ప్రభావం:- 
కంపెనీ  90శాతం ప్రమోటర్ వాటాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 22శాతానికి సమానమైన వాటాను ఆయా కంపెనీల్లో తనఖా పెట్టారు. ఇది ప్రమోటర్లకు కంపెనీపై నియంత్రణ కోల్పోయే లేదా బలవంతపు టేకోవర్‌ జరగవచ్చనే కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో బలవంతపు టేకోవర్‌ వ్యవహారాలు చాలా తక్కువ. అందరు రుణాదాతలు, వీటీబీ క్యాపిటల్‌ (రష్యన్ కంపెనీ) ఒకే తాటిపై వచ్చిన ఏదైనా చర్య తీసుకుంటే తప్ప అది అసంభవం. కంపెనీలో వాటాలో ఒక్కోసారి తగ్గవచ్చు. మరోసారి పెరగవచ్చు. కొంతకాలానికి కంపెనీ వాటాను పెంచుకోనే శక్తి సామర్ద్యాలు మాకున్నాయి. ఈ పరిస్థితిలో కూడా, ప్రమోటర్లు తనఖా పెట్టిన 22శాతం వాటాలో కనీసం సగం వాటా మిగిలి ఉంటుందనే నమ్మకం ఉంది.You may be interested

ఝున్‌ఝున్‌వాలా పోర్టుఫోలియోలో ఏ స్టాకులున్నాయ్‌!

Monday 7th October 2019

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా..పరిచయం అక్కర్లేని పేరు. దలాల్‌ స్ట్రీట్‌లో 1985లో కేవలం రూ. 5,000తో మొదలైన ఆయన ప్రయాణం, బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం 2019 అగష్టు నాటికి  రూ. 17,500 కోట్లకు చేరుకుంది.ఇండియా వారెన్‌బఫెట్‌గా పిలుచుకునే ఈ సీనియర్‌ ఇన్వెస్టర్‌, 30 కి పైగా స్టాకులలో 1 శాతం కంటే అధిక వాటాను కలిగి ఉన్నారు. ఈయన పోర్టుఫోలియో విలువ సుమారుగా రూ. 13,000 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ

దొంగ కంపెనీలు ఎప్పటికీ మారవు: పొరింజు

Monday 7th October 2019

  నమ్మదగిన కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్‌ చేయాలని, ఇంటెగ్రిటీ ఉన్న కంపెనీలు మాత్రమే నిలకడగా రాణిస్తాయని దలాల్‌స్ట్రీట్‌ సీనియర్‌ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘చాలా వరకు దొంగ కంపెనీలు ఎప్పటికి మారవు! నన్ను నమ్మండి, చేంజ్‌ ఇండియా థీమ్‌లో భాగంగా ఇన్వెస్ట్‌ చేసి నా చేతులు కాల్చుకున్నాను’ అని పొరింజు వెలియత్‌ ట్వీట్‌ చేశారు. ‘హిస్టోరిక్‌ డిటాక్సిఫికేషన్‌ డ్రై’ లో భాగంగా ఈ దొంగ కంపెనీలు

Most from this category