News


తుదిదశలో ఒప్పందం..5 శాతం పెరిగిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Wednesday 24th July 2019
Markets_main1563962816.png-27286

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని కొంత వాటాను విక్రయించడానికి ఒక ఒప్పందం తుది దశకు చేరుకుందని జీ మేనేజింగ్‌ డైరక్టర్‌ పునిత్‌ గోయెంక ‍ప్రకటించడంతో బుధవారం(జులై 24)  జీ షేరు విలువ 4.28 శాతం లాభపడి రూ.376.25 వద్ద ముగిసింది.  మరొక ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాం. వివరాలను కొద్ది రోజులలో ప్రకటిస్తాం’ అని పునిత్‌ గోయెంక అన్నారు. జీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన వారిలో 90 శాతం మంది చెల్లింపులు పూర్తి చేయడానికి కంపెనీకి సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. 171 దేశాలలో 66 టెలివిజన్ ఛానెళ్లను కలిగిన జీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టెలివిజన్ ప్రసార సంస్థలలో ఒకటి.  ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా ప్రజలను ఇది చేరుకుంది.


zee

You may be interested

ఐదో రోజూ ఆగని అమ్మకాలు

Wednesday 24th July 2019

11300దిగువున ముగిసిన నిఫ్టీ  135 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్‌ మార్కెట్‌లో అమ్మకాలు ఆగడం లేదు. ఫలితంగా సూచీలకు ఐదోరోజూ నష్టాల ముగింపు తప్పలేదు. మెటల్‌, అటో, ఫార్మా, ఇంధన, బ్యాకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా జరగడంతో బుధవారం సెన్సెక్స్‌ 135 పాయింట్లను నష్టపోయి 37,847.65 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లను కోల్పోయి 11300ల దిగువున 11,271 వద్ద స్థిరపడింది. బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 175(0.60శాతం)

ఆగస్టు సీరిస్‌ కోసం ఐదు సిఫార్సులు

Wednesday 24th July 2019

సాంక్టమ్‌ వెల్త్‌ రికమండేషన్లు వచ్చే ఆగస్టు సీరిస్‌లో 10- 16 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. పవర్‌గ్రిడ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 199. జూలై 2017లో ఆల్‌టైమ్‌ హైని తాకి వెంటనే వేగంగా రూ. 172 వరకు పతనమైంది. ఆతర్వాత రూ. 172- 205 మధ్య గతేడాది మొత్తం కన్సాలిడేట్‌ అవుతూవచ్చింది. గత జూన్‌లో ఈ కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది.

Most from this category