STOCKS

News


ఆరేళ్ల కనిష్టానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Monday 7th October 2019
Markets_main1570429639.png-28753

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సేవలను అందించే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌‍ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ఉదయం సెషన్‌లో ఆరేళ్ల కనిష్టానికి పతమయ్యాయి. కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ ఎస్సెల్‌ మీడియా వెంచర్‌  తన మొత్తం వాటాలో 10.71శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను వీటీబీ క్యాపిటల్‌ వద్ద తనఖా పెట్టినట్లు శుక్రవారం జీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునీత్‌ గోయెంకా కంపెనీ తెలిపారు. కంపెనీలో 90శాతం ప్రమోటర్లు కంపెనీ చెందిన 22 శాతం వాటాను ఆయా ఆయా ఫైనాన్సియల్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ల్లో తనఖా చేసినట్లు చెప్పుకొచ్చారు. గణాంకాల ప్రకారం జూన్ 30 నాటికి కంపెనీలో తనఖా షేర్ల సంఖ్య 210 మిలియన్‌ ఉన్నాయి. మరోవైపు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ షేర్లకి అండర్‌వెయిట్‌ రేటింగ్‌ను కేటాయించింది. అంతేకాకుండా షేరు టార్గెట్‌ ధరనను రూ. 370 నుంచి రూ. 248కు కుదిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై మార్కెట్‌ ప్రారంభంలో దాదాపు 14శాతం నష్టపోయి రూ.203.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరుకు ఆరేళ్ల కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం 11:30నిల.కు షేరు క్రితం ముగింపు(రూ.236.80)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.222 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన రూ. 13400 కోట్ల నుంచి కంపెనీ రుణ భారం రూ. 6300 కోట్లకు తగ్గినట్లు తెలుస్తోంది. రుణ భారం తగ్గించుకునే అంశంలో ప్రమోటర్లకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌, రుణ భారం తదితర సమస్యల కారణంగా ఈ కంపెనీ షేర్లు ఏడాది ప్రారంభంలో 56శాతం క్షీణించాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.203.70, రూ.506.10లుగా నమోదయ్యాయి. You may be interested

15-35 శాతం రాబడులనిచ్చే 3 స్టాకులు!

Monday 7th October 2019

గత కొన్ని సెషన్ల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా చాలా వరకు స్టాకులు రోజువారి చార్టులో ట్రెండ్‌ రివర్సల్‌ను ఏర్పర్చాయి. ప్రస్తుతం ఈ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నార్నోలియ ఫైనాన్సియల్‌ అడ్వజర్స్‌, టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రిసెర్చ్‌ హెడ్‌ షబ్బిర్‌ ఖయ్యుమి అన్నారు. సాంకేతిక విశ్లేషణ ఆధారంగా సమీప కాలంలో 15-35 శాతం రిటర్న్‌లివ్వగలిగే 3 స్టాకులను సిఫార్సు చేశారు.  ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌: సుమారు

బ్యాంక్‌ నిఫ్టీ 220 పాయింట్లు అప్‌!

Monday 7th October 2019

ఆర్‌బీఐ మరోదపా 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించడంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకింగ్‌ షేర్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 228.65 పాయింట్లు లాభపడి 28029.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.59 శాతం లాభపడి రూ. 1208.65 వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.89

Most from this category