News


‘‘జీ’’ షేర్లకు క్యూ2 ఫలితాల షాక్‌..!

Friday 18th October 2019
Markets_main1571385483.png-28981

మీడియా రంగంలో సేవలు అందిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటడ్‌ షేర్లకు క్యూ2 ఫలితాల ప్రకటన సెగ తగలింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 9శాతానికి పైగా నష్టపోయాయి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రకటించింది. ఆదాయ వృద్ధి నెమ్మదించడం, బలహీన నిర్వహణ మార్జిన్ల కారణంగా రెండో క్వార్టర్లో కంపెనీ నికర లాభం 7 శాతమే పెరిగి రూ. 413 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 7.4 శాతం పుంజుకుని రూ. 2122 కోట్లను సాధించింది. ప్రకటనల ద్వారా ఆదాయం రూ. 1225 కోట్లకు చేరింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయం 19 శాతం ఎగసి రూ. 723 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 2.5 శాతం బలపడి రూ. 693 కోట్లయ్యింది. ఫలితాలు అంచనాలకు లేకపోవడంతో నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనన్నాయి. ఒకదశలో 9.38 శాతం నష్టపోయి రూ.239.85 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.1:10ని.లకు షేర్లు క్రితం ముగింపు(రూ.264.70)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.256 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని సైతం 3.50శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో మొదటిస్థానంలో ట్రేడ్‌ అవుతోంది. ఇక షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.203.70లు రూ. 506.10లుగా నమోదయ్యాయి. 



You may be interested

బడాషేర్లే బెటర్‌ అంటున్న ఎల్‌ఐసీ

Friday 18th October 2019

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ విక్రయం లార్జ్‌క్యాప్స్‌పై ఫోకస్‌ దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ క్రమంగా లార్జ్‌క్యాప్స్‌పై ఎక్కువ మక్కువ చూపుతోంది. మార్కెట్‌ పరిస్థితులు అంతగా బాగాలేకపోవడంతో తన పోర్టుఫోలియోలోని చిన్న, మధ్యతరహా షేర్లను అమ్మేస్తోంది. గత త్రైమాసికంలో సిమెంట్‌, నిర్మాణం, రియల్టీ, ఇంజనీరింగ్‌, గ్యాస్‌ సరఫరా, టెక్స్‌టైల్స్‌ సహా వివిధ రంగాలకు చెందిన తనవద్దున్న చిన్న షేర్లను ఎల్‌ఐసీ వదిలించుకుంటోందని గణాంకాలు చూపుతున్నాయి.  ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకున్న కంపెనీలు... గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, లక్ష్మీమెషెన్‌వర్క్స్‌,

రిటైల్‌ ఇన్వెస్టర్లు మక్కువ చూపిన షేర్లివే!

Friday 18th October 2019

యస్‌బ్యాంకుపై అధికాసక్తి సెప్టెంబర్‌ త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ సహా కొన్ని షేర్లపై రిటైలర్లకు మక్కువ పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయి. తాజాగా యస్‌బ్యాంకులో రిటైలర్‌ మదుపరుల సంఖ్య 13లక్షలను దాటింది. బడా కంపెనీలైన ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాదారుల్లో రిటైలర్ల సంఖ్య కన్నా యస్‌బ్యాంకులో రిటైల్‌ వాటాదారుల సంఖ్య ఎక్కువ. యస్‌బ్యాంకుతో పాటు బీఓబీ, విప్రో, టాటామోటర్స్‌, టీసీఎస్‌, బయోకాన్‌ తదితరాల్లో క్యు2లో పెరిగింది. రిటైల్‌

Most from this category