STOCKS

News


వాటా విక్రయ వార్తలతో జీ మీడియా 15శాతం జం‍ప్‌

Thursday 21st November 2019
news_main1574313083.png-29753

ముంబై:- ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 15శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.337.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 15శాతం పెరిగి రూ.353.20 పెరిగి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.10:20ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.324.10)తో పోలిస్తే 7శాతం లాభంతో రూ.328.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.203.70లు, రూ.506.10గా నమోదయ్యాయి.
ఇదీ నేపథ్యం:- 
 దేశీయ అతిపెద్ద లిస్టెడ్‌ మీడియా కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటర్లు 16.5శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అమ్మకం కోసం కేటాయించిన మొత్తం ప్రమోటర్ వాటాలో, 15.శాతం వరకు గురువారం బ్లాక్ డీల్‌లో భాగంగా గురువారం చేతులు మారనున్నాయి. ఒప్పంద పత్రం ప్రకారం  మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్‌ 77 మిలియన్‌ షేర్లను, క్వైతర్ గ్రూప్‌ 61 మిలియన్‌ షేర్లను, ఎస్సాల్‌ గ్రూప్‌ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్‌ సంస్థ డీల్స్‌కు బుక్‌ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాలకు చెల్లింపుకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్‌సీ గ్లోబల్‌ చైనా ఫండ్‌కు  2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. ప్రమోటర్‌, ప్రమోట్‌ గ్రూప్‌నకు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 22.37శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. షేర్‌హోల్డింగ్‌ డాటా ప్రకారం 96శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టినట్లు తెలుస్తోంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడ్డారు. You may be interested

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 21st November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో ప్లాట్‌గా 71.83 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఆందోళనలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 10 పైసలు బలహీనపడి 71.81 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతల వలన అమెరికా-చైనా ట్రేడ్‌ డీల్‌ మరింత ఆలస్యమవతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ

పాక్‌లో కేజీ టమోటా@ రూ. 400

Thursday 21st November 2019

పాకిస్తాన్‌ పెద్ద నగరమైన కరాచిలో టమోటా ధరలు బుధవారం ఆకాశాన్ని తాకాయి. కేజీ టమోటా ధర రూ. 400 కు చేరుకుంది. వర్షాలు అధికంగా కురవడంతో టమోటా దిగుబడి తగ్గిందని, అంతే కాకుండా ప్రభుత్వం దిగుమతులపై నియంత్రణలు విధించడంతో డిమాండ్‌కి తగ్గ సరఫరా జరగడం లేదని డాన్‌ న్యూస్‌ పేర్కొంది. గత వారం పాకిస్తాన్‌ ప్రభుత్వం, ఇరాన్‌ నుంచి 4,500 టన్నుల టమోటాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతినిచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం

Most from this category