News


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 8 శాతం అప్‌

Wednesday 6th February 2019
Markets_main1549445049.png-24049

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు వరుసగా రెండోరోజూ లాభపడ్డాయి. బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో బుధవారం 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.365.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఎస్సాల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు ఈ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్‌ మార్కెట్లో విక్రయించారు. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు తెలుస్తుంది.ఫలితంగా నేడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ఇంట్రాడే 8శాతం ర్యాలీ చేసి రూ.396.45ల వద్ద ఇంట్రాడే గరిష్టానికి తాకింది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు(రూ.365.3)తో పోలిస్తే 6శాతం లాభంతో రూ.387.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 288.95 రూ.609.75లుగా నమోదయ్యాయి.



You may be interested

ఎడిల్‌వీజ్‌ టాప్‌ బెట్స్‌

Wednesday 6th February 2019

మార్కెట్‌ పట్ల తాము జాగురూకతతో వున్నామని, అయితే తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల కారణంగా ఏడాదికాలంలో వినియోగ, గ్రామీణ సంబంధిత షేర్లు మంచి పనితీరు కనపర్చవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2019 జూన్‌కు తాము గతంలో నిర్దేశించిన 9800-10,500 నిఫ్టీ టార్గెట్‌ శ్రేణిలో ఎటువంటి మార్పూ లేదని, కానీ ఎంపికచేసిన షేర్లు రాబడులనిచ్చే అవకాశం వుందని ఎడిల్‌వీజ్‌ వివరించింది. ఈ నేపధ్యంలో ఈ బ్రేకరేజ్‌...8 లార్జ్‌క్యాప్‌ షేర్లను,

మూడోరోజూ కొనసాగుతున్న అడాగ్‌ షేర్ల పతనం

Wednesday 6th February 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌ అడాగ్‌ షేర్ల పతనం ఆగట్లేదు. దివాళా పరిష్కారానికి ఎన్‌సీఎటీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్స్‌, రిలయన్స్‌ నావెల్‌ ఇంజనీరింగ్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైవ్‌ షేర్లు 28శాతం నుంచి 11శాతం క్షీణించాయి. అయితే ఇదే అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ పవర్‌

Most from this category