News


‘‘జీ’’ 12శాతం అప్‌

Thursday 31st October 2019
Markets_main1572515833.png-29263

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12.30శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.236.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన మాతృసంస్థ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌లో 10శాతం వాటా అమ్మకం గురించి తగిన సమాచారం ఇవ్వకపోవడంతో రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లావాదేవీ పూర్తయ్యేవరకూ తనఖాలో వున్న  ప్రమోటర్ వాటాను ఎస్క్రో ఖాతాలో ఉంచే ప్రతిపాదనను తొలగించారు. అయినప్పటికీ ఈ షేరు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గచూపారు. ఫలితంగా ఒకదశలో 12:30శాతం పెరిగి రూ.264.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.235.15)తో పోలిస్తే 9.36శాతం లాభంతో రూ.257.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.199.15, రూ.506.90లు ఉన్నాయి. 
డిష్‌ టీవీ షేరు 17% అప్‌:- 

 జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు ర్యాలీతో అదే గ్రూప్‌ కంపెనీ డిష్‌టీవీ షేరు లాభాల బాట పట్టింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.10.80వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే 20.56శాతం పెరిగి రూ.12.90 వద్ద గరిష్టస్థాయిని అందుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.10.70)తో పోలిస్తే 16.82శాతం లాభంతో రూ.12.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధర వరుసగా రూ.10.40, రూ.44.45లు ఉన్నాయి.You may be interested

సెన్సెక్స్‌ కొత్త రికార్డు... ఐదో రోజూ లాభాలే..

Thursday 31st October 2019

బ్యాంకింగ్‌, ఐటీ, ఫార్మా రంగ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ 5రోజూ లాభంతో ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆయా రంగాల్లో హెవీవెయిట్‌  షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 340 పాయింట్ల లాభపడి 40,392 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ఏడాది జూన్‌4నాటి 40,312 పాయింట్ల రికార్డుస్థాయిని తాజాగా అధిగమించడం ద్వారా కొత్త రికార్డును సెన్సెక్స్‌ నెలకొల్పింది. అయితే మరో

బజాజ్‌ షేర్లు బంగారమే!

Thursday 31st October 2019

అదానీ, అంబానీ, టాటా, బిర్లా గ్రూప్‌ స్టాక్స్‌ కన్నా స్పీడ్‌ రాబడులు గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైని అందుకుంది. ఈ సందర్భంగా 2019 తొలి పదినెలల్లో ఇన్వెస్టర్ల సంపదను పెంచిన షేర్లు, సంపద ధ్వంసం చేసిన షేర్లు పరిశీలిస్తే మొదటి కేటగిరీలో బజాజ్‌గ్రూప్‌ షేర్లు, రెండో గ్రూప్‌లో అడాగ్‌ షేర్లు నిలిచాయి. 2019 అక్టోబర్‌ వరకు చూస్తే బజాజ్‌ గ్రూప్‌ షేర్లు అత్యంత వేగవంతమైన రాబడినిచ్చిన షేర్లుగా నిలిచాయి. అత్యంత స్పీడుగా

Most from this category