News


బ్రోకరేజ్‌ల డౌన్‌గ్రేడ్‌...జీ డౌన్‌ 10 శాతం

Thursday 1st August 2019
Markets_main1564650783.png-27477

రుణ సంక్షోభం నుంచి గట్టెక్కెందుకు ఇన్వెస్కో ఓపెన్‌ హైపర్‌ ఫండ్‌కు రూ.4224 కోట్ల విలువైన వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటీకీ.., జీ మీడియా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 7 శాతం వరకు క్షీణించాయి. ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యూహాత్మకంగా ఫైనాన్షియల్‌ ఇన్వెస్టర్‌కు వాటా విక్రయిచడం ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచినట్లు మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఫైనాన్షియల్‌ ఇన్వెస్టరుకు విక్రయిస్తే యాజమాన్య నిర్వహణ ఎస్సెల్‌ చేతుల్లోనే వుంటుంది. జీ షేర్లను తనఖా పెట్టుకున్న మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇతర ఆర్థిక సంస్థలు ఆందోళన వ్యక్త చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రేటింగ్‌ సంస్థలు షేరు కొనుగోలు ధరపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. పునీత్‌ గోనియ్‌ మాట్లాడుతూ ‘‘రుణాల చెల్లింపునకు సంబంధించి రుణదాతలకు ఇచ్చిన గడువు ముంచుకొస్తున్న తరుణంలో యాజమాన్యం వ్యూహాత్మకంగా ఫైనాన్సియల్‌ ఇన్వెస్టర్‌కు వాటా విక్రయించేందుకు మొగ్గుచూపింది’’ అన్నారు. 
సిటి బ్రోకరేజ్‌ సం‍స్థ:- షేర్లకు న్యూట్రల్‌ రేటింగ్‌ కేటాయించింది. షేరు టార్గెట్‌కు ధరను రూ.430లు నిర్ణయించింది. ఒపెన్‌హైమర్ 11 శాతం వాటా విక్రయం సరిపోదు. వివిధ రుణదాతలకు తిరిగి చెల్లించే ప్రాధాన్యతపై కంపెనీ వివరణ ఇవ్వాల్సి ఉంది.
క్రిడెట్‌ శాష్యూ:- షేర్లకు న్యూట్రల్‌ రేటింగ్‌ కేటాయించింది. షేరు టార్గెట్‌కు ధరను రూ.440 నిర్ణయించింది. ఈ ఒప్పందం ప్రమోటర్ రుణ సమస్యలలో కొంత భాగాన్ని మాత్రమే పరిష్కరించగలుగుతుంది.
పీఎన్‌పీ పారిభాష్‌:- షేర్లకు హోల్డింగ్‌ను రేటింగ్‌ కేటాయించింది. షేరు టార్గెట్‌కు ధరను రూ.390 నిర్ణయించింది.
ఎమ్‌కాయ్‌:- షేర్లకు ‘‘సెల్‌’’ను రేటింగ్‌ కేటాయించింది. షేరు టార్గెట్‌కు ధరను రూ.390 నిర్ణయించింది. 
7శాతం పతనమైన షేరు:- నేడు బీఎస్‌ఈలో కంపెనీ రూ.359.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం వరకు క్షీణించి రూ. 336.00ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20నిల.కు షేరు గతముగింపు(రూ361.45)తో పోలిస్తే 4.50శాతం నష్టపోయి రూ.344.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.288.95 రూ.540.40లుగా నమోదయ్యాయి. You may be interested

52 వారాల కనిష్టానికి వేదాంత

Thursday 1st August 2019

మెటల్‌ షేర్ల పతనంతో భాగంగా గురువారం వేదాంత షేర్లు భారీ నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.153.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ కోత విధింపు ఇక ముందు కొనసాగపోవచ్చనే పావెల్‌ వాఖ్యలతో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటల్‌ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన వేదాంత షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6.50శాతం క్షీణించి రూ.144.05ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

ఎన్‌బీఎఫ్‌సీలకు సీనియర్‌ మేనేజర్లు బై

Thursday 1st August 2019

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంతో ఈ రంగంలో పనిచేసిన సీనియర్‌ మేనేజర్లు బ్యాంకింగ్‌ లేదా ఫిన్‌టెక్‌ విభాగాలకు మారుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ఒకనొకప్పుడు బ్యాంకింగ్‌ సెక్టార్‌ నుంచి ఎన్‌బీఎప్‌సీల వైపు స్విచ్‌ ఓవర్లు జరిగిన విషయం తెలిసిందే. మనీషా లాత్ గుప్తా (క్లిక్స్ క్యాపిటల్ నుంచి ఉబెర్‌కు), రమేష్ విశ్వనాథన్  (ఎల్ అండ్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్‌కు) స్విచ్‌ఓవర్‌ చేసిన వారిలో సుప్రసిద్ధులు.

Most from this category