News


కుప్పకూలిన జీ, జెట్‌, డెల్టా కార్ప్‌, దివాన్‌

Tuesday 17th March 2020
Markets_main1584438198.png-32535

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు యస్‌ బ్యాంక్‌ కేసు ఎఫెక్ట్‌  
సిక్కింలో కేసినో మూతతో డెల్టా కార్ప్‌నకు దెబ్బ

ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన సంస్థలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీల ప్రమోటర్లను ఈ నెల 18న హాజరుకావలసిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ రాణాకపూర్‌పై నమోదైన మనీలాండరింగ్‌ కేసు విషయంలో తాజా ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో దివాన్‌ హౌసింగ్‌ ప్రమోటర్లను సైతం 17న హాజరుకమ్మంటూ ఈడీ తాఖీదులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో మధ్యాహ్నం 2.50 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 16 శాతం కుప్పకూలింది. రూ. 140 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 138.50 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. కాగా.. దివాన్‌ హౌసింగ్‌ షేరు కొనుగోలుదారులు కరువుకావడంతో 5 శాతం డౌన్‌ సర్క్యూట్‌కు చేరి రూ. 12.10 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఈ బాటలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు సైతం 5 శాతం పతనమై రూ. 16.10 వద్ద డౌన్‌ సర్క్యూట్‌లో ఫ్రీజయ్యింది. 

డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు కేసినోను ఏప్రిల్‌ 15వరకూ మూసివేస్తున్నట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. కరోనా వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేసే ప్రయత్నాలలో భాగంగా సిక్కిం ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయనున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు అందేవరకూ కేసినో నిర్వహణను నిలిపివేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో డెల్టా కార్ప్‌ షేరు 10 శాతం పతనమైంది. రూ. 77.3 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

చివరికి పతనమే- ఆగని అమ్మకాలు

Tuesday 17th March 2020

సెన్సెక్స్‌ 811 పాయింట్లు డౌన్‌ 230 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 దిగువకు ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా బోర్లా 59 శాతం దూసుకెళ్లిన యస్‌ బ్యాంక్‌  ప్రపంచ మహమ్మారిగా అవతారమెత్తిన కోవిడ్‌-19 ధాటికి మరోసారి దేశీ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ 811 పాయింట్లు పతనమై 30,579 వద్ద నిలవగా.. నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 8.967 వద్ద ముగిసింది. వెరసి మూడేళ్ల తదుపరి నిఫ్టీ 9,000 పాయింట్ల మైలురాయి దిగువన ముగిసింది.

సన్‌ఫార్మా బైబ్యాక్‌ ధర రూ.425

Tuesday 17th March 2020

రూ.1700 కోట్లతో సొంత ఈక్విటీ షేర్లను కొనుగోలు(బైబ్యాక్‌) చేయనున్నట్లు మంగళవారం సన్‌ ఫార్మా ప్రకటించడంతో ఒక్కసారిగా షేరు విలువ పెరిగింది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా షేరు 7 శాతం లాభపడింది. బైబ్యాక్‌లో భాగంగా 4 కోట్ల షేర్లను రూ.425 ధర మించకుండా కొనుగోలు చేసేందుకు  సన్‌ఫార్మా కంపెనీ డైరెక్టర్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. సోమవారం ముగింపుతో పోలిస్తే ఈ ధర 15.48 శాతం ఎక్కువ. కాగా ఈ షేర్లు

Most from this category