News


చిన్న స్టాకులు కొనే సమయం ఇదేనా?!

Thursday 9th January 2020
Markets_main1578560752.png-30802

అవునంటున్న బ్రోకరేజ్‌లు
కొత్త ఏడాది దలాల్‌ స్ట్రీట్‌లో ట్రెండ్‌ మారుతుందని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే రెండేళ్లుగా మార్కెట్లో నీరసంగా ఉంటున్న చిన్న షేర్లు ఈ ఏడాది పుంజుకుంటాయంటున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ యూఎస్‌, జపాన్‌ మార్కెట్లలో కనిపిస్తోందన్నారు. దేశీయ మిడ్‌క్యాప్స్‌ సైతం అంతర్జాతీయ మిడ్‌క్యాప్‌ సూచీలతో సమన్వయం కలిగి ఉంటాయని, అందువల్ల మన దగ్గర కూడా స్మాల్‌స్టాక్స్‌ పరుగులు తీసే సమయం వచ్చిందని చెబుతున్నారు. యూఎస్‌లో, యూరప్‌లో మిడ్‌క్యాప్‌ సూచీలు రెండేళ్ల అనంతరం ఈ ఏడాది కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. ఇది దేశీయ మిడ్‌క్యాప్స్‌కు శుభసూచకమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. దీనికితోడు నిఫ్టీ 500 స్టాక్స్‌లో సగానికి పైగా స్టాక్స్‌ తమ 200 రోజుల డీఎంఏ స్థాయిలకు పైకి చేరితే, ఆ ఏడాది మిడ్‌క్యాప్‌ స్టాకులు దాదాపు 40 శాతం ర్యాలీ చేస్తాయని గత ట్రెండ్స్‌ చెబుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో వచ్చిన నాలుగు బుల్‌ రన్స్‌ ఇదే విషయాన్ని నిరూపిస్తున్నాయి. మన మార్కెట్లో ఒక మంచి బుల్‌ మార్కెట్‌ ముందుందని, మిడ్‌క్యాప్స్‌ అప్‌ట్రెండ్‌కు సుముఖంగా ఉన్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. అందువల్ల ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోల్లో లార్జ్‌క్యాప్స్‌ స్థానంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌కు ఎక్కువ వాటా కేటాయించే సమయం ఇదేనని సూచించింది.

రెండేళ్ల పాటు మిడ్‌, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు నెగిటివ్‌ రాబడులు ఇచ్చాయి. 2018లో భారీగా పతనమైన ఈ సూచీ, 2019లో ఒక మోస్తరు పతనమే చూసింది. ఇలా ఒక మోస్తరు పతనం వచ్చిన తదుపరి ఏడాది మిడ్‌క్యాప్‌ సూచీ మంచి ర్యాలీ చేసింది. ఉదాహరణకు 2011లో పతనం అనంతరం 2012లో 2013 పతనం అనంతరం 2014లో మిడ్‌క్యాప్‌ సూచీ మంచి ర్యాలీ జరిపింది. గత రెండేళ్లలో చిన్నస్టాకుల మార్కెట్‌ క్యాప్‌ గరిష్ఠాల నుంచి దాదాపు 63 శాతం పడిపోయిందని, దీంతో వీటి వాల్యూషన్లు బాగా దిగివచ్చి ఆకర్షణీయంగా మారాయని ఈక్వినోమిక్స్‌ రిసెర్చ్‌ తెలిపింది. ఈ సమయంలో నాణ్యమైన చిన్నస్టాకులను ఎంచుకోవాలని సూచించింది. కొత్త ఏడాది లార్జ్‌క్యాప్స్‌ కన్నా చిన్నస్టాకులు దూసుకుపోవచ్చని ప్రముఖ ఇన్వెస్టర్‌ పొరింజు అభిప్రాయపడ్డారు. పలు నాణ్యమైన చిన్నస్టాకులు ఈ ఏడాది ఆశ్చర్యకరమైన రాబడులు ఇస్తాయని అంచనా వేశారు. You may be interested

వెలుగులోకి రియల్టీ షేర్లు

Thursday 9th January 2020

52వారాల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌  రియల్టీ రంగ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల బాటపట్టాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. అలాగే 52-వారాల గరిష్ట స్థాయిని అందుకుంది. గృహాలకు కొనుగోలు చేసే వారికి ఆర్థిక భరోసానిచ్చే రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ) పథకాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం కొనుగోలుదారులకు,

బీజీఆర్‌, అదానీ, యాస్టర్‌.. జోరు

Thursday 9th January 2020

బీజీఆర్‌ ఎనర్జీ అదానీ గ్రీన్‌ ఎనర్జీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 570 పాయింట్లు జంప్‌చేసి 41,387కు చేరగా.. నిఫ్టీ 170 పాయింట్లు జమ చేసుకుని 12,195 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ వార్తల ఆధారంగా మూడు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బీజీఆర్‌ ఎనర్జీ ఎలక్ట్రికల్‌ ప్రాజెక్ట్‌ విభాగం

Most from this category