News


ఎనిమిదేళ్ల కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Friday 27th September 2019
Markets_main1569563014.png-28586

ప్రమోటర్ల వాటా విక్రయాలతో తీవ్ర కష్టాలను ఎదుర్కోంటున్న యస్‌బ్యాంక్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎనిమిదేళ్ల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
క్రితం ట్రేడింగ్‌లో 5శాతం నష్టపోయిన యస్‌బ్యాంక్‌ షేర్లు... నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ప్రధాన ప్రమోటింగ్‌ సంస్థల్లోఒకటైన యస్‌ క్యాపిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ(వైసీపీఎల్‌) ప్రతి షేరు ధర రూ.51.94 చొప్పున మొత్తం 4.65 కోట్ల ఈక్విటీ షేర్లను(1.82శాతం వాటాకు సమానం) రూ.241.5 కోట్లకు విక్రయించింది. అలాగే యూబీఎస్‌.... యస్‌బ్యాంక్‌ షేరు టార్గెట్‌ ధరను రూ.70 నుంచి రూ.45లకు డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడటానికి మార్కెట్‌ అంచనాల కంటే మరింత సమయం పడుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అభిప్రాయపడింది. ఫలితంగా షేర్లు నేటి ట్రేడింగ్‌లో మరో 5శాతం క్షీణించి రూ.48.50 స్థాయికి పతనమయ్యాయి. ఉదయం గం.11:00లకు షేరు క్రితం ముగింపు(రూ.51.05)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.52.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వైసీపీఎల్‌ ఈ వాటా విక్రయంతో యస్‌బ్యాంక్‌లో మొత్తం వాటా 2.97శాతం నుంచి 1.15శాతానికి పరిమితమైంది. ఈ మొత్తం నిధులను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ రుణ చెల్లింపులకు వినియోగిస్తున్నట్లు వైసీపీఎల్‌ తెలిపింది. గత వారంలో ప్రమోటర్‌ రాణా కపూర్‌ సొంత కంపెనీ మోర్గాన్‌ క్రెడిట్స్‌ 2.3శాతం వాటాను రూ.337 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. యస్‌బ్యాంక్‌లో సెప్టెంబర్‌ 26 నాటికి ప్రమోటర్ల వాటా 13.50శాతం ఉంది. అందులో రాణా కపూర్‌ వాటా 3.8శాతంగానూ, యస్‌క్యాపిటల్‌ వాటా 1.2శాతంగానూ, మోర్గాన్‌ క్రిడెట్స్‌ వాటా 0.3శాతం గానూ, మధు కపూర్‌ వాటా 6.8శాతంగానూ, మాగ్స్ ఫిన్వెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాటా 1.4శాతంగానూ ఉంది.  నేడు యస్‌బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.13,019.45 కోట్లుగా ఉంది. కాగా షేర్ల ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.48.50 రూ.286.00లుగా ఉన్నాయి.



You may be interested

స్థిరంగా పసిడి ధర

Friday 27th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 2 డాలర్ల స్వల్ప నష్టంతో 1,513.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ఇన్వెస్టర్లు అగ్రరాజ్యమైన అమెరికా ప్రతినిధుల సభలో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్‌పై అభిశంసన తీర్మానం అంశంపై, అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పరిణామాలపై దృష్టిని సారించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల నిమిత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు

నష్టాల్లో మారుతి, బజాజ్‌, హీరో మోటో

Friday 27th September 2019

అంతర్జాతీయ మార్కెట్‌లు శుక్రవారం నెగిటివ్‌లో ట్రేడవుతుండడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా అదే బాటాలో నడుస్తున్నాయి. ఉదయం 10.48 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.45 శాతం కోల్పోయి 7,548.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన మారుతి సుజుకీ 1.25 శాతం నష్టపోయి రూ. 6,772.05 వద్ద, బజాజ్‌ ఆటో 1.01 శాతం నష్టపోయి రూ. 2,940.35 వద్ద, ఐషర్‌ మోటర్స్‌ 0.62 శాతం రూ.

Most from this category