STOCKS

News


యస్‌ బ్యాంకు.. నిధుల సమీకరణతోనే సానుకూలత

Tuesday 24th December 2019
Markets_main1577129098.png-30389

యూరోపియన్‌ సంస్థలు యస్‌ బ్యాంకులో బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు రాగా, ఇది సఫలం అయితే బ్యాంకు ఊపిరి పీల్చుకున్నట్టేనని ఈల్డ్‌ మ్యాగ్జిమైజర్‌ వ్యవస్థాపకుడు యోగేష్‌ మెహతా పేర్కొన్నారు. పలు అంశాలపై ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

యస్‌ బ్యాంకు
యస్‌ బ్యాంకు టైర్‌-1, టైర్‌-2 నిధుల కొరతను ఎదుర్కొంటోంది. అలాగే, మూలధన నిధులు కూడా బ్యాంకుకు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. నిధుల అవసరం ఎంతో ఉంది. మొదటి దశ నిధుల సమీకరణ విజయవంతమైంది. రెండో దశ అనిశ్చితిలో ఉంది. మూడో విడతగా యూరోప్‌ సంస్థలు బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు వింటున్నాం. ఇది ఆచరణ సాధ్యమైతే బ్యాంకుకు కొంత ఉపశమనం. స్టాక్‌ మరింత పతనం కాకుండా ఊపిరినిచ్చినట్టు అవుతుంది. అలాగే, తిరిగి బ్యాంకు స్వల్పకాలానికి గాడిలో పడుతుంది. ఈ తరహా నిధుల సమీకరణ బ్యాంకుకు తప్పనిసరి. విజయవంతం అయితే స్టాక్‌ రూ.40-45 స్థాయిలో మద్దతు తీసుకుంటుంది. నాలుగు లేదా ఐదో దశలో మరిన్ని నిధులను సమీకరిస్తే సాధారణ స్థితికి చేరుకుని, వ్యాపార స్థిరీకరణకు వీలు చిక్కుతుంది.

 

బ్యాంకులు, ఫైనాన్షియల్‌ రంగంలో వేటికి ప్రాధాన్యం?
ప్రభుత్వరంగ బ్యాంకుల స్టాక్స్‌కు, ముఖ్యంగా ఎస్‌బీఐకి ప్రస్తుతం దూరంగా ఉంటాను. కరెక్షన్‌ కోసం వేచి చూస్తున్నాను. ప్రస్తుతానికి అయితే ఎన్‌బీఎఫ్‌సీల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ పట్ల సానుకూలంగా ఉన్నాను. ఎందుకంటే బంగారం రుణ వ్యాపారం మరింత సురక్షితమైనది. ఎందుకంటే బంగారం ధరలు గరిష్టాలకు చేరడంతోపాటు, స్థిరంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఆరు నుంచి 10 నెలల కాలానికి బంగారం సురక్షిత సాధనం. బంగారం రుణ వ్యాపారం కూడా స్థిరమైనది. వార్షికంగా 15-17 శాతం కాంపౌండెడ్‌గా 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు వృద్ధి చెందుతుంది. మార్జిన్లు కూడా గరిష్టంగా ఉన్నాయి. కనుక ప్రస్తుత ధరలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకు ఆకర్షణీయం. మణప్పురం ఫైనాన్స్‌ నూతన గరిష్ట స్థాయిల్లో ఉండగా, ముత్తూట్‌ ఫైనాన్స్‌ కూడా గరిష్టాలకు సమీపంలోనే ట్రేడవుతోంది. You may be interested

ప్రతికూల ఓపెనింగ్‌!?

Tuesday 24th December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్లు డౌన్‌ దేశీ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 18 పాయింట్ల నష్టంతో 12,262 పాయింట్ల వద్ద కదులుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. చైనాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై త్వరలో సంతకాలు చేయనున్నట్లు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రకటించడంతో సోమవారం మరోసారి అమెరికా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల వద్ద

2020లో మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు..

Tuesday 24th December 2019

కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. 2019 కంటే 2020లో మార్కెట్‌ మెరుగ్గా ఉండాలన్న ఆకాంక్ష ఇన్వెస్టర్లు అందరిలోనూ ఉంటుంది. కానీ, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అవసరం. గడిచిన ఏడాది కాలంలో మనం చూసిన ఎన్నో అంశాల్లో కొన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగొచ్చని ఎమ్‌కే వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో భవేష్‌ సంఘ్వి అంచనా వేస్తున్నారు. 2020లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలను ఆయన వెల్లడించారు.   అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల

Most from this category