News


2020కి యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు

Saturday 11th January 2020
Markets_main1578734895.png-30863

కొత్త ఏడాదిలో ఆరు అధిక రాబడినిచ్చే స్టాకులతో యస్‌ సెక్యూరిటీస్‌ మోడల్‌ పోర్టుఫోలియోను అప్‌డేట్‌ చేసింది.
1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 100. వాణిజ్యవాహన విభాగంలో సైక్లిక్‌ రికవరీకి అవకాశాలున్నాయి. దీంతో కంపెనీ ముందుగా లాభపడనుంది. కంపెనీ వచ్చే రెండేళ్ల పాటు ఎబిటా, ఈపీఎస్‌లో వరుసగా 26, 38 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయవచ్చు. ప్రస్తుతం వాల్యూషన్లు గరిష్ఠాల వద్ద ఉన్నాయి. ఇలా వాల్యూషన్లు సైక్లిక్‌ గరిష్ఠాలకు చేరిన తర్వాత 12- 18 నెలల్లో షేరు దాదాపు 30- 200 శాతం లాభపడినట్లు గత చరిత్ర చెబుతోంది. ఈ సారి కూడా ఇదే రిపీట్‌ కావచ్చని అంచనా. 
2. పాలీక్యాబ్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1094. కొత్త ఉత్పత్తుల ప్రవేశం, ఎగుమతులు పెరగడంతో కేబుల్స్‌ విభాగంలో రెవెన్యూగ్రోత్‌ రెండంకెల స్థాయిని చేరవచ్చని అంచనా. దీంతో బ్రాండ్‌ వాల్యూ, కస్టమర్‌ బేస్‌, ఉత్పత్తి సామర్ధ్యం పెరుగుతాయి. రాబోయే రెండేళ్లలో ఎఫ్‌ఎంసీజీ రెవెన్యూ రెండింతలు కావచ్చు. రూ.250 కోట్ల మూలధన వ్యయం తర్వాత కూడా వచ్చే మూడేళ్లలో రూ.1150 కోట్ల మిగులు నిధులు సమకూరతాయని అంచనాలున్నాయి. 
3. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 545. ఎబిటా, లాభం వచ్చే రెండేళ్లపాటు వరుసగా 16, 13 శాతం మేర చక్రీయ వార్షిక వృద్ధి సాధిస్తాయని అంచనా. కంపెనీకి రూ. 16100 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల విలువైన మిసైల్‌ వెసల్స్‌ తదితర ఆర్డర్లు రానున్నాయి. షిప్‌ రిపేరింగ్‌ మార్కెట్లో వాటా పెంచుకోవాలిన కంపెనీ భావిస్తోంది. 
4. బిర్లాకార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 990. మధ్య భారతంలో 14 శాతం మార్కెట్‌ వాటా కలిగిఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా బలంగా విస్తరిస్తోంది. కంపెనీకి విస్తారమైన ల్యాండ్‌బ్యాంక్‌, సున్నపు గనులు ఉన్నాయి. రిలయన్స్‌ సిమెంట్‌ సొంతం చేసుకోవడంతో వృద్ధి మెరుగుదల అవకాశాలు పెరిగాయి. మరికొన్ని రాష్ట్రాల్లో సామర్ధ్య విస్తరణ పనులు చేపట్టనుంది. 
5. కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక‌్షన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 295. రోడ్లు, వ్యవసాయ రంగాల్లో బలమైన ఆర్డర్‌ బుక్‌ కలిగిఉంది. రాబోయే రెండేళ్ల పాటు రెవెన్యూలో 18 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉండొచ్చు. దాదాపు 17 శాతం ఆపరేటింగ్‌ మార్జిన్లు నమోదు చేస్తోంది. తాజాగా బీఓటీ ఆస్తుల విక్రయంతో బాలెన్స్‌ షీట్‌ బలోపేతం కానుంది. దీంతో మరిన్ని ప్రాజెక్టులకు కంపెనీ బిడ్డింగ్‌ వేసే వీలు కలగనుంది. ముఖ్యంగా క్యు4లో జోరుగాసాగే ఎన్‌హెచ్‌ఏఐ బిడ్డింగ్‌లో జోరుగా పాలుపంచుకోవచ్చు. 
6. రెప్కోహోమ్‌ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 402. ఇతర హెచ్‌ఎఫ్‌సీలపై ఇన్వెస్టర్లు వ్యక్తం చేసే ఆందోళనలు ఈ కంపెనీకి వర్తించవు. ఆరోగ్యవంతమైన ఏఎల్‌ఎం ప్రొఫైల్‌, మూడేళ్లుగా మంచి వృద్ధి, స్థిరమైన లిక్విడిటీ బఫర్‌, చెక్కుచెదరని క్రెడిట్‌ రేటింగ్‌, బలమైన మూలధన సంపద, ఎన్‌పీఎల్‌ల్లో అధిక రికవరీ.. కంపెనీని ముందంజలో ఉంచుతున్నాయి. 
తన మోడల్‌ పోర్టుఫోలియోలో ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌పీసీఎల్‌, మహానగర్‌ గ్యాస్‌కు కూడా యస్‌ సెక్యూరిటీస్‌ స్థానం కల్పించింది. హెచ్‌యూఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, మారికో, ఇప్కాల్యాబ్స్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌లను తప్పించింది. ఫైనాన్షియల్స్‌, క్యాపిటల్‌గూడ్స్‌, ఇన్‌ఫ్రా, బీమా, చమురురంగాలపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు వెల్లడించింది. You may be interested

ఈ మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Saturday 11th January 2020

కోల్టెపాటిల్‌ డెవలపర్స్‌ ఇండియన్‌ హోటల్స్‌ ర్యాలీస్‌ ఇండియా దేశ, విదేశీ అంశాల ప్రభావంతో ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య సరికొత్త గరిష్టాలను అందుకుంటున్నాయి. దేశీయంగా జీడీపీ మందగమనం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుసహా ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ వంటి అంశాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార ఒప్పందం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ తగ్గింపు బాట వంటి అంశాలు

ఇకపై ఇన్ఫోసిస్‌ వృద్ధి మరింత స్పీడ్‌?

Saturday 11th January 2020

రానున్న నాలుగైదేళ్లలో పటిష్ట పనితీరు ఇన్వెస్టర్లు కొత్త ధృక్పథంతో చూడాలి సెక్యులర్‌ వృద్ధిలో దేశీ ఐటీ కంపెనీలు గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ అంచనా దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రానున్న నాలుగు, ఐదేళ్ల కాలంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు గ్లోబల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ సహవ్యవస్థాపకులు ట్రిప్‌ చౌదరీ తాజాగా అంచనా వేశారు. ఇన్వెస్టర్లు సరికొత్త ధృక్పథంతో ఈ కంపెనీని చూడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ ఫలితాలతోపాటు.. దేశ ఐటీ

Most from this category