STOCKS

News


స్మాల్‌క్యాప్స్‌పై తప్పుగా అంచనా వేశా: పొరింజు వెలియత్‌

Friday 19th July 2019
Markets_main1563520664.png-27174

  • ఎన్నికలు టర్నింగ్‌ పాయింట్‌గా భావించా.
  • బడ్జెట్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
  • రేట్‌ కట్‌ పాలసీలు, బడ్జెట్‌... స్మాల్‌ క్యాప్‌లను ఆదుకోలేకపోయాయి : పొరింజు వెలియత్‌

స్మాల్‌ క్యాప్‌లలో ఇన్వెస్ట్‌ చేసి ప్రస్తుత పరిస్థితులలో వీటిని అమ్మడానికి లేదా హోల్డ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న వారు నాలుగు ముఖ్య విషయాలను గమనించాలని స్మాల్‌ క్యాప్‌ ఇన్వెస్టింగ్‌ నిపుణుడు పొరింజు వెలియత్‌ అన్నారు.  ఆయన పోర్ట్‌ఫోలియోలో ఇంకా కొన్ని అండర్‌ పెర్ఫార్మ్‌ స్టాకులున్నాయని తెలిపారు.
 
ఇవి గమనించాల్సి అవసరం ఉంది...  
   పెట్టుబడి థీసిస్ శాశ్వతంగా ప్రమాదంలో పడిందా లేక నిరవధికంగా ఆలస్యం అయ్యిందా అని పరిశీలించడటం వలన వేచి చూడటం కంటే మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతామని గురువారం ఖాతాదారులకు రాసిన లేఖలో పొరింజు తెలిపారు. ఈ నిర్ణయం...​ప్రస్తుత నిరుత్సాహకర మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌లను లిక్విడిటీగా మార్చుకోవాలనుకునే వారి స్వబావంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో లభించే స్టాక్స్‌ తరుగుదలను భర్తీ చేయగలిగే  ప్రత్యామ్నాయ అవకాశం ఉందా అనే ప్రశ్న కూడా ఉందని అన్నారు. ‘ఈ స్టాక్స్‌లో మరింత ఇబ్బంది ఏమైనా ఉంటుందా? మార్కెట్ సెంటిమెంట్ తిరిగి పుంజుకున్నప్పుడు ఈ స్టాక్స్‌కు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల కంటే మెరుగ్గా పని చేసే అవకాశం ఉందా?’ అని కూడా పరిశీలించాలని అన్నారు.

ఆర్థిక నియంత్రణలే స్మాల్‌ క్యాప్‌లకు అడ్డంకి..
  తన పీఎంఎస్‌(పోర్ట్‌పోలియో మానేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) రిడంప్షన్‌ డిమాండ్‌ అంచనాలను అందుకోలేకపోయిందన్న వార్త తప్పు అని చెప్పారు. భారతదేశంలో కఠినమైన ఆర్థిక, నియంత్రణ వాతావరణం ఉండడం వలన స్మాల్‌క్యాప్ స్టాక్స్‌ నష్టపోతున్నాయని, వీటితో పాటు లార్జ్‌ క్యాప్‌లపై కూడా ఈ ప్రభావం ఉందని అన్నారు.  స్మాల్‌క్యాప్‌లు 2013 నుంచి 2017 మధ్య కాలంలో అధికంగా లాభపడ్డాయని తెలిపారు. కాగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోని సుమారు 1,350 స్టాకులు 2018 జనవరి నుంచి ప్రస్తుతం వరకు ఇన్వెస్టర్ల సంపదలో  50 శాతం క్షీణించడానికి కారణం అయ్యాయి. గత 18 నెలల్లో సుమారు 122 స్టాకులు 90-99 శాతం విలువను కోల్పోయాయి. బీఎస్‌ఈలో ట్రేడయ్యే 2,900 స్టాకులలో 86 శాతం అనగా 2,500 స్టాకులు గత ఏడాది జనవరి నుంచి సరియైన రిటర్న్‌లను అందించలేక పోయాయి. గత ఏడాది మొత్తంలో స్మాల్‌క్యాప్ విభాగంలో  దాదాపు 335 కంపెనీల కవరేజీని బ్రోకరేజీలు నిలిపివేసాయి. కొంతమంది విశ్లేషకులు మాత్రమే 225 కంపెనీలను కవర్ చేస్తున్నారు. 

బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాం..కానీ..
    స్మాల్‌క్యాప్-కేంద్రీకృత 43 పీఎంఎస్‌ఈల 16 పథకాలలో ఏవీ కూడా గత నెలలో సంపదను సృష్ఠించలేకపోయాయి. మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో తీసుకొచ్చిన రేట్‌ కట్‌ పాలసీలు, ఆర్థిక క్రమశిక్షణ కలిగిన బడ్జెట్‌... స్మాల్‌ క్యాప్‌ రంగాన్ని ఆదుకోలేకపోయాయి.  ‘ఎన్నికల ఫలితాలు మార్కెట్లకు సానుకూలంగా పరిణమిస్తాయని అనుకున్నా కానీ బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్‌ ప్రతికూల ప్రతిపాదనలు సమీప భవిష్యత్‌లో సెంటిమెంట్‌ను దెబ్బశాయి’ అని​ పోరింజు వివరించారు. స్మాల్‌క్యాప్‌లలో గణనీయమైన రికవరీ అనివార్యంగా కనిపిస్తోందని, కానీ ఖచ్చితమైన కాలపరిమితిని చెప్పడం కష్టమన్నారు. మోడీ 2.0 తొలి బడ్జెట్ దీర్ఘకాలిక దృష్టిని నిర్దేశించినప్పటికీ, దానిలోని కొన్ని ప్రతిపాదనలు స్టాక్ మార్కెట్‌ను నిరాశపరిచాయని తెలిపారు.  

 You may be interested

తప్పనిసరై జాతీయం

Friday 19th July 2019

- బ్యాంకుల జాతీయీకరణకు 50 ఏళ్లు - వ్యవసాయం, చిన్న సంస్థలకు పెరిగిన రుణాలు - నలు దిశలా విస్తరించిన బ్యాంకు శాఖలు - అందరికీ అందుబాటులోకి బ్యాంకింగ్‌... - ప్రభుత్వ అజమాయిషీతో తప్పుడు నిర్ణయాలు - మొండిబాకీలతో కుదేలవుతున్న పీఎస్‌బీలు - ప్రైవేటీకరణే సరైన పరిష్కారమంటూ సూచనలు!! (సాక్షి, బిజినెస్‌ విభాగం) సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేదు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు

సెన్సెక్స్‌ 400 పాయింట్లు క్రాష్‌..

Friday 19th July 2019

ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుడటంతో సూచీల పతనం కొనసాగుతుంది. ముఖ్యంగా అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగాలకు చెందిన షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 419 పాయింట్లు నష్టపోయి 38,478 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు క్షీణించి 11500 స్థాయిని కోల్పోయి 11,466.45 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో

Most from this category