News


యస్‌ బ్యాంక్‌ షేరు దూకుడు

Thursday 23rd January 2020
Markets_main1579769546.png-31137

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) చీఫ్‌ రజనీశ్‌ కుమార్‌ తాజాగా పేర్కొన్నారు. దేశీ ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో యస్‌బ్యాంకు ఒక ప్రముఖమైన బ్యాంకు అంటూ దావోస్‌ సదస్సులో కితాబునిచ్చారు. ఇంత ప్రాముఖ్యమున్న బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన్న అంచనాల మధ్య రజనీశ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 
సికాల్‌ వాటా విక్రయం
రవాణా రంగ కంపెనీ సికాల్‌ లాజిస్టిక్స్‌లో గల 2.08 శాతం వాటాను విక్రయించినట్లు యస్‌ బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. ఈ నెల 22కల్లా వివిధ దశలలో 12,20,001 సికాల్‌ షేర్లను విక్రయించినట్లు తెలియజేసింది. దీంతో సికాల్‌ లాజిస్టిక్స్‌లో ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ వాటా 2 శాతం స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6 శాతం జంప్‌చేసి రూ. 41 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

చమురు తగ్గుదల ఎఫెక్ట్‌...పెట్రో షేర్లకు జోష్‌

Thursday 23rd January 2020

భారీగా తగ్గిన చమురు ధరలు 6 శాతం జంప్‌చేసిన ఐవోసీ చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో మొదలైన చమురు ధరల పతనం గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం కొనసాగింది. నాలుగు శాతంపైగా క్షీణించడంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 7 వారాల కనిష్టానికి చేరాయి. దీంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. లాభాల బాటలో చమురు ధరలు నీరసించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 7 శాతం అప్‌.!

Thursday 23rd January 2020

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) షేరు గురువారం మిడ్‌సెషన్‌ కల్లా 7శాతం లాభపడింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.297.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ నుంచి ఆర్థిక సర్వీసు షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ షేరుకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఒకదశలో 7.15శాతం లాభపడి రూ.317.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు మునుపటి ముగింపు(రూ.296.25)తో పోలిస్తే రూ.296.25తో పోలిస్తే

Most from this category