News


‘యస్‌ బ్యాంకు’ వార్నింగ్‌ బెల్స్‌..!

Saturday 18th January 2020
Markets_main1579286329.png-31000

యస్‌ బ్యాంకుకు ఇప్పుడు నిధులే ప్రాణవాయువు. ఎంత వేగంగా నిధులు సమీకరిస్తే బ్యాంకు సొంతంగా నిలదొక్కుకునేందుకు, గాడిలో పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, కారణాలేవైనా కానీ, నిధుల సమీకరణలో బ్యాంకు తీవ్ర జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితులు చేయి దాటిపోతే ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం పలువురు అనలిస్టుల నుంచి వినిపిస్తోంది. 

 

యస్‌ బ్యాంకు రూ.10,000 కోట్ల నిధులను క్యూఐపీ/జీడీఆర్‌/ఏడీఆర్‌/ఎఫ్‌సీసీబీ ఇలా పలు మార్గాల్లో సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకు వాటాదారుల అనుమతి తీసుకునేందుకు ఫిబ్రవరి 7న సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ రూ.10వేల కోట్లు ఏ మాత్రం సరిపోవన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వస్తోంది. ఎందుకంటే డిసెంబర్‌ త్రైమాసికం, జనవరి-మార్చి త్రైమాసికంలో తాజాగా ఎదురయ్యే ఎన్‌పీఏలకు చేయాల్సిన కేటాయింపుల వల్ల బ్యాంకు నిధులపై ఎంతో ఒత్తిడి వస్తుందని ముగ్గురు అనలిస్టుల అభిప్రాయాల ఆధారంగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. యస్‌ బ్యాంకు ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.10,000 కోట్లు. అంటే ప్రస్తుత మార్కెట్‌ విలువకు సమాన స్థాయిలో బ్యాంకు నిధులను సమీకరించేందుకు తలపెట్టింది. దీంతో బ్యాంకు ఈక్విటీ రెట్టింపు కానుంది. ఇది షేరువారీ పుస్తక విలువ, ఆర్జనపై ప్రభావం చూపించేదే. ఒకవేళ అనుకున్న విధంగా బ్యాంకు నిధులను సమీకరించలేకపోతే యస్‌ బ్యాంకును మరో బ్యాంకులో విలీనం చేయడం ఒక్కటే ఆర్‌బీఐ ముందున్న ఆప్షన్‌గా సదరు అనలిస్టులు పేర్కొన్నారు.


యస్‌ బ్యాంకు లాంగ్‌టర్మ్‌ ఫారీన్‌ కరెన్సీ ఇష్యూయర్‌ రేటింగ్‌ బీ2ను సమీక్షలో ఉంచుతున్నట్టు మూడిస్‌ శుక్రవారం ప్రకటించింది.  ‘‘నిధుల సమీకరణపై బ్యాంకు గత అంచనాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. ఈ విడత నిధులు సమీకరించగలరా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది’’ అని అనలిస్టులు పేర్కొన్నారు. టైర్‌-1 మూలధన నిధుల రేషియోను కనీసం 8 శాతంగా మార్చి త్రైమాసికంలో కొనసాగించడం యస్‌ బ్యాంకు ముందున్న పెద్ద సవాలుగా పేర్కొంటున్నారు. గత త్రైమాసికం నాటికి ఇది 8.7 శాతంగా ఉండగా, తాజాగా వచ్చే ఎన్‌పీఏలకు చేయాల్సిన కేటాయింపుల వల్ల ఇదే స్థాయిలో కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘నిధుల సమీకరణలో ఆలస్యం, పెరుగుతున్న ఎన్‌పీఏల వల్ల బ్యాంకు సాల్వెన్సీ ప్రొఫైల్‌, క్యాపిటల్‌ మరింత బలహీనపడతాయి. కనుక నిధులను తక్షణమే సమీకరించడం ఎంతో అవసరం’’ అని ఇక్రా పేర్కొంది. 

 

యస్‌ బ్యాంకు ఎన్‌పీఏల పోర్ట్‌ఫోలియోకు మూడో త్రైమాసికంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, సుజ్లాన్‌, ఆల్టికో చేరొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. యస్‌ బ్యాంకు లోన్‌బుక్‌లో 62 శాతం కార్పొరేట్‌ రునాలే అయి ఉండడంతో ఇప్పుడు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘‘ఒక్కో రోజు గడిచే కొద్దీ సంక్షోభం మరింత పెరుగుతుంది. మార్కెట్‌ విలువ తరిగిపోతుంది. తాజా ఎన్‌పీఏలు పెరిగితే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు దూరం అవుతారు. అప్పుడు రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐ ఇన్వెస్టర్లే మిగులుతారు. అప్పుడు మరో బ్యాంకులో విలీనం తప్ప ఏమీ ఉండదు’’ అని ఓ అనలిస్ట్‌ పేర్కొన్నారు.You may be interested

మళ్లీ రిలయన్స్‌ రికార్డు

Saturday 18th January 2020

ఒ‍క ప్రైవేట్‌ కంపెనీ అత్యధిక త్రైమాసిక లాభం ఇదే  వినియోగ వ్యాపారాల జోరు  రిలయన్స్‌ రిటైల్‌కు రికార్డ్‌ స్థాయిలో నిర్వహణ లాభం, ఆదాయాలు కొనసాగుతున్న రిలయన్స్‌ జియో హవా  ముంబై/న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.11,640 కోట్ల నికర లాభం​(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ3లో రూ.10,251 కోట్ల నికర లాభం వచ్చిందని, 14 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. షేర్‌ పరంగా చూస్తే,

క్యూ3లో ఎల్‌ఐసీ ఈక్విటీ కొనుగోళ్లు ఇవే..

Friday 17th January 2020

దేశీయంగా పెద్ద ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లలో ఎల్‌ఐసీ కూడా ఒకటి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను కూడా నిర్వహిస్తోంది. సుమారు రూ.31 లక్షల కోట్ల ఆస్తులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపేణా వచ్చిన ఆదాయం నుంచి రిస్క్‌, పరిపాలనా చార్జీలను మినహాయించగా, మిగిలిన నిధులను సైతం ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటుంది. డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3)లో ఎల్‌ఐసీ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ వివరాలు ఇవి...  డిసెంబర్‌ త్రైమాసికంలో

Most from this category